వార్నీ.. సర్ఫరాజ్ ఖాన్ ను ఎంపిక చేయకపోవటమే మంచిదైంది?
ఈ క్రమంలోనే గత మూడు సీజన్ల నుంచి రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్.. అటు భారత జట్టు టెస్టు సిరీస్ లోకి ఎంపిక చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అతని పట్ల సెలెక్టర్లు వివక్ష చూపిస్తున్నారు అంటూ ఎంతో మంది మాజీలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇక ఇటీవల సర్పరాజ్ ఖాన్ ప్రదర్శన చేసిన తర్వాత అతని సెలెక్ట్ చేయకుండా సెలెక్టర్లు మంచి పని చేశారు అంటూ కొంతమంది క్రికెట్ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఎందుకంటే దులిప్ ట్రోఫీలో భాగంగా ఇటీవల సర్పరాజ్ ఖాన్ ఘోరంగా విఫలం అయ్యాడు.
వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో వెస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన సర్ఫరాజ్ ఖాన్ 12 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ గా పెవిలియన్ చేరాడు అని చెప్పాలి. అయితే నేటి నుంచి ప్రారంభమైన ఈ మ్యాచ్ ఫస్ట్ ఇండియన్స్ లో ఐదో స్థానంలో బ్యాటింగ్ కీ వచ్చిన ఈ ముంబై బ్యాట్స్మెన్ క్రీజ్ లో అడుగుపెట్టినప్పటి నుంచే ఎందుకో తడబడుతూ కనిపించాడు. ఈ క్రమంలోనే శివం మావి వేసిన 25 ఓవర్ లో డకౌట్ అయ్యాడు అని చెప్పాలి. దీంతో సర్ఫరాజ్ ఖాన్ వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేయకపోవడమే మంచిదైంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.