వరల్డ్ కప్ రెండో బెర్త్ ఎవరిదో.. నేడే తేలబోతుంది?
అదే సమయంలో వరుస పరాజయాలతో సతమతమైన కొన్ని జట్లు అటు వరల్డ్ కప్ లో ఆడే అవకాశాన్ని కోల్పోయాయి అని చెప్పాలి. అయితే ఇంకొన్ని టీమ్స్ మాత్రం ఇంకా వరల్డ్ కప్ లో ఆడటం కోసం అర్హత సాధించే పనిలో నిమగ్నమయ్యాయ్.ఈ క్రమంలోనే ఇప్పటికే ఇక రెండు స్థానాల కోసం జరిగిన పోటీలో శ్రీలంక ఒక స్థానాన్ని కైవసం చేసుకోగా.. ఇక రెండవ స్థానాన్ని సొంతం చేసుకోబోయే జట్టు ఏది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా వరల్డ్ కప్ రెండో బెర్తుని కన్ఫర్మ్ చేసుకోబోయే జట్టు ఏది అన్న విషయం పై నేడు క్లారిటీ రాబోతుంది అని చెప్పాలి.
అయితే జింబాబ్వే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడంతో ప్రస్తుతం స్కాట్లాండ్ జట్టుకి అవకాశాలు మెరుగయ్యాయి. కాగా నేడు నెదర్లాండ్స్ తో స్కాట్లాండ్ జట్టు ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో భాగంగా స్కాట్లాండ్ గెలిస్తే నేరుగా వరల్డ్ కప్ కి అర్హత సాధిస్తుంది అని చెప్పాలి. ఒకవేళ నెదర్లాండ్ విజయం సాధిస్తే మాత్రం నెట్ రన్ రేట్ కీలకంగా కానుంది అని చెప్పాలి. అయితే స్కాట్లాండ్ కన్నా బెటర్ రన్ రేట్ సాధిస్తే నెదర్లాండ్ అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్ రద్దయిన అటు వరల్డ్ కప్ కి స్కాట్లాండ్ అర్హత సాధిస్తుంది అని చెప్పాలి.