ఆస్ట్రేలియా క్షమాపణలు చెప్పాల్సిందే.. ఇంగ్లాండ్‌ మాజీ దిగ్గజం వ్యాఖ్యలు?

praveen
యాషెస్‌ సిరీస్‌ ఎప్పుడు జరిగినా ట్రెండింగ్ లో ఉంటుంది. ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ మధ్య ఈ యాషెస్‌ సిరీస్‌ జరుగుతుంది. 2023 జూన్ లో యాషెస్‌ సిరీస్‌ మళ్ళీ మొదలయ్యింది. ఇప్పటికే 2 టెస్టు మ్యాచులు అయిపోయాయి. ఈ రెండు మ్యాచుల్లో ఆస్ట్రేలియా గెలిచింది. అయితే రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ బెయిర్‌స్టో వికెట్ అవుట్ అయ్యాక యాషెస్‌ సిరీస్‌ మరింత హీట్ పెంచింది. బెయిర్‌స్టో స్ట్రైక్ లో ఉండగా బౌలర్ వేసిన బాల్ డాట్ అయ్యింది. అయితే ఈ బెయిర్‌స్టో బాల్ డాట్ అయ్యాక క్రీజ్ దాడి ముందుకొచ్చాడు. అయితే వికెట్ కీపర్ బాల్ ని వికెట్లకు త్రో చేయగా ఆ బాల్ వికెట్ లకు తాకింది. ఆస్ట్రేలియా అవుట్ అని అపీల్ చేయగా అంపైర్ అవుట్ అని ప్రకటించారు. ఈ రన్ అవుట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ రన్ అవుట్ ఫై మాజీ క్రికెటర్లు అందరు స్పందిస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్‌ మాజీ దిగ్గజం జాఫ్రీ బాయ్‌కాట్‌ కూడా ఈ ఘటనపై స్పందించారు.

బెయిర్‌స్టో వివాదాస్పద ఔట్‌ను బాయ్‌కాట్‌ ఖండించాడు. ఇది సిగ్గు చేటు చర్య అని.. దీనిపై ఆస్ట్రేలియా జట్టు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాడు. ‘తాము చేసిన దానిపై ఆస్ట్రేలియా జట్టు ఆలోచించుకోవాలి. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. అదే దీనికి పరిష్కారం. గొప్ప క్రీడా స్ఫూర్తితో వారు అద్భుతమైన క్రికెట్‌ ఆడారు. అయితే.. ఇలాంటి ఘటనతో దాన్ని నాశనం చేసుకోవడం సిగ్గుచేటు’ అంటూ ఓ మీడియాకు రాసిన వ్యాసంలో బాయ్‌కాట్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా బాయ్‌కాట్‌ మాట్లాడుతూ క్రికెట్ ని నిజాయితీగా ఆడాలని సూచించాడు. కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించాడు. అంతే కాకుండా ఈ టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆటతీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. రెండో టెస్టులో స్టోక్స్ ఒంటరి పోరాటం చేసినా ఇంగ్లాండ్ జట్టుకు ఓటమి తప్పలేదు. ఇంకెంత మంది ఈ రన్ అవుట్ గురించి స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: