ఇండియాతో సిరీస్ లు.. వెస్టిండీస్ క్రికెట్ కీలక నిర్ణయం!
ఈ మ్యాచ్ ముగియగానే వెస్టిండీస్ జట్టు స్వదేశంలో భారత జట్టును ఢీకొట్టనుంది. స్వదేశంలో టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సుదీర్ఘ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో విండీస్ జట్టు తలపడనుంది. జూలై 12 నుంచి మొదటి టెస్ట్ మ్యాచ్ తో సిరీస్ ప్రారంభం కానుంది. ఈసారి వెస్టిండీస్ జట్టుకు టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లలో మెంటార్‌గా దిగ్గజ ఆటగాడు బ్రియన్ లారాను నియమించాలని ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత జట్టు విండీస్ గడ్డపై ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు చాలా మంది ఆటగాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ టీం ఇండియా తరపున ఈ వెస్టిండీస్ పర్యటనలోనే అరంగేట్రం చేయనున్నారనే వార్తలు కూడా ఉన్నాయి.
వెస్టిండీస్ తో ఆడే భారత జట్టు అంచనా ఇదే:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ.
వెస్టిండీస్ జట్టు అంచనా ఇదే:
వెస్టిండీస్ సన్నాహక జట్టు:
క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్వుడ్, ఎన్క్రుమా బోనర్, తగెనరైన్ చంద్రపాల్, రఖీమ్ కార్న్వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్.