క్రీడా స్ఫూర్తి మీకు వర్తించదా.. ఆసీస్ పై గంభీర్ కామెంట్స్?

praveen
ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన జట్ల గురించి చర్చ వచ్చినప్పుడల్లా ఆస్ట్రేలియా పేరు కూడా ముందు వరుసలో వినిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్ గా కొనసాగుతూ ఇక ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తూ వస్తుంది ఈ టీం. అయితే ఆటపరంగా జట్టులో ఎంతోమంది టాలెంట్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక్కడ వరకు అంతే ఓకే కానీ ఇక ఆస్ట్రేలియా జట్టు అంటే మరో దానికి కూడా మారుపేరుగా ఉంది. అదే చీటింగ్. ఆస్ట్రేలియా తో మ్యాచ్ అంటే చాలు ఆ జట్టు ఆటగాళ్లు ఎలాగైనా చీటింగ్ చేస్తారని ప్రత్యర్థి   జట్ల ఆటగాళ్లు భావిస్తూ ఉంటారు. ఇక స్లెడ్జింగ్ చేయడంలో ఆస్ట్రేలియాను మించిన టీం మరొకటి లేదు అనడంలో సందేహం లేదు.


 ఇప్పటికే ఎన్నోసార్లు అటు వరల్డ్ క్రికెట్లో స్లెడ్జింగ్  తో వార్తలు నిలిచింది ఆస్ట్రేలియా టీం. అంతేకాదు ఇక వివాదాస్పద క్యాచ్ లతో ఇటీవల కాలంతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ప్లేయర్లు క్రీడా స్ఫూర్తిని మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు అంటూ క్రికెట్ విశ్లేషకులు కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించింది ఆస్ట్రేలియా. విజయం అయితే సాధించింది కానీ ఆ జట్టు ఆటగాళ్ల తీరు మాత్రం ఎవ్వరికి నచ్చడం లేదు.



 సిరీస్ లో భాగం గా రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాడు బెయిర్ స్ట్రో ను ఆస్ట్రేలియా అవుట్ చేసిన విధానం అయితే సగటు క్రికెట్ ప్రేక్షకుడికి కూడా అస్సలు నచ్చలేదు. ఇక ఇటీవల ఇదే విషయం గురించి భారత మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్  స్పందిస్తూ షాకింగ్ చేశాడు. ఆస్ట్రేలియా జట్టుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. హే స్లెడ్జర్స్ ..  క్రీడా స్ఫూర్తి లాంటి లాజిక్ మీకు వర్తించదా? ఇది కేవలం భారతీయులకేనా అంటూ  విమర్శలు గుప్పించాడు. గతంలో అశ్విన్ మన్కడింగ్ చేసిన సమయంలో కొంతమంది ఆస్ట్రేలియా మాజీలు స్పందిస్తూ క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అంటూ విమర్శలు చేయగా ఇక ఇప్పుడు గంభీర్ ఇందుకు కౌంటర్ ఇచ్చాడు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: