12 ఏళ్ల తర్వాత.. అదే చోట ఆడబోతున్న ఇండియా, శ్రీలంక?

praveen
ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. ఈ వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ఇప్పటికే 8 టీమ్స్ నేరుగా ఇక వరల్డ్ కప్ మ్యాచ్లను ఆడబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. కానీ ఇక మిగతా రెండు స్థానాలు కోసం మాత్రం కొన్ని టీమ్స్ క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే రెండు స్థానాల కోసం ఎన్నో జట్లు పోటీ పడ్డాయి అని చెప్పాలి. అయితే ఇక ఈ క్వాలిఫైయర్ మ్యాచ్లలో భాగంగా మంచి ప్రదర్శన చేసి ప్రత్యర్థులపై పూర్తి ఆదిపత్యాన్ని కనబరిచిన శ్రీలంక.. ఇటీవల వరల్డ్ కప్ కోసం అర్హత సాధించింది.


 ఇటీవల జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ఇక వన్డే వరల్డ్ కప్ 2023 కు అర్హత సాధించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే నవంబర్ రెండవ తేదీన వాంఖడే స్టేడియంలో టీం ఇండియాతో మ్యాచ్ ఆడబోతుంది. అయితే 12 ఏళ్ల తర్వాత శ్రీలంక టీమిండియాలో  మళ్లీ అదే మైదానంలో  ఆడబోతున్నాయి అన్నది తెలుస్తుంది. సరిగా పన్నెండేళ్ల క్రితం వాంకడే స్టేడియంలో 2011 ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంక, టీమిండియా జట్లు తలపడ్డాయి. ఈ సమయంలో శ్రీలంక పై అటు టీం ఇండియా విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది అని చెప్పాలి. ధోని కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలిచింది.


 ఇప్పుడు అవే రెండు టీమ్స్ ఏకంగా వాంకడే స్టేడియం లో 4597 రోజుల తర్వాత మళ్లీ మ్యాచ్ లు ఆడుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో కూడా పాత సెంటిమెంట్ రిపీట్ అవుతుందని.. ఈ క్రమంలోనే శ్రీలంక పై అటు భారత జట్టు విజయం సాధిస్తుందని టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే శ్రీలంక వరల్డ్ కప్ ఆడేందుకు అర్హత సాధించగా.. ఇక రెండో స్థానంలో అర్హత సాధించబోయే టీం ఏది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈసారి భారత్ వేదికగా వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా తప్పకుండా టైటిల్ గెలుస్తుందని భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: