పాకిస్తాన్ తో మ్యాచ్లో.. కోహ్లీ నాకు ఏడు ఆప్షన్లు ఇచ్చాడు : అశ్విన్
అయితే గత ఏడాది టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులందరికీ ఎంతైన్మెంట్ పంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగానే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఉత్కంఠ ఒక రేంజ్ లో ఉంటుంది. అలాంటిది చివరి బంతి వరకు కూడా ఎవరు విజేతగా నిలుస్తారో అనేది తెలియని విధంగా మ్యాచ్ సాగితే ఆ ఉత్కంఠ రెట్టింపు అవుతుంది అని చెప్పాలి. క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా కన్నురెప్ప కొడితే ఎక్కడ అద్భుతమైన క్షణాలను మిస్ అవుతామో అని రెప్ప వాల్చకుండా మ్యాచ్ వీక్షించారు. కాగా క్లిష్టమైన సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ ఇక భారత జట్టును విజేతగా నిలిపి 130 కోట్ల ఇండియన్స్ గౌరవాన్ని నిలబెట్టాడు.
అయితే విరాట్ కోహ్లీ ఒకవైపు నుంచి దూకుడుగా ఆడుతున్న సమయంలో మరోవైపు నుంచి టీమిండియా స్పిన్నర్ అశ్విన్ క్రీజ్ లోకి వచ్చాడు. ఆ సమయంలో విరాట్ తనతో చెప్పిన విషయాన్ని ఇటీవల ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. ఆరోజు టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ జరిగిన సమయంలో నేను క్రీజ్ లోకి రాగానే లాస్ట్ బాల్ ఎలా ఆడాలో చెబుతూ కోహ్లీ నాకు ఏకంగా ఏడు ఆప్షన్లు ఇచ్చాడు. ఆ షాట్స్ అన్ని ఆడగలిగితే నేను ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ ఎందుకు వస్తాను అని నాలో నేను అనుకున్నాను. కానీ ఆ సమయంలో కోహ్లీ కళ్ళలో ఏదో పవర్ కనిపించింది అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు.