కీలక మ్యాచులన్ని మోదీ స్టేడియంలోనే.. క్రీడల్లోనూ రాజకీయాలా?

praveen
ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. అయితే ఈ వరల్డ్ కప్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇక మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అందరూ కూడా సిద్ధమైపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వరల్డ్ కప్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ కూడా ప్రకటించింది. దీంతో ఏ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది అనే విషయంపై కూడా క్లారిటీ వచ్చేసింది. దీంతో ఇక తమ తమ జట్లకు మద్దతుగా స్టేడియం కు చేరుకొని ప్రోత్సహించేందుకు ఇక అన్ని దేశాల క్రికెట్ ఫ్యాన్స్ కూడా సిద్ధమైపోతున్నారు అని చెప్పాలి.

 అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన షెడ్యూల్ పై మాత్రం అటు తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అటు వరల్డ్ కప్ లో భాగంగా కీలకమైన మ్యాచ్లు అన్నింటినీ కూడా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతున్నాయి అని చెప్పాలి. మిగతా సాదాసీదా మ్యాచులు మాత్రం ఇక మరికొన్ని స్టేడియంలో జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే ఇదే విషయంపై ఎంతోమంది మాజీ ఆటగాళ్లకు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నరేంద్ర మోడీ స్టేడియంలోనే కీలకమైన మ్యాచ్లకు పెద్దపీట వేయడం పై పంజాబ్ క్రీడామంత్రి గుర్మీర్ సింగ్ స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

 కీలకమైన మ్యాచులకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది.  పక్కనే ఉన్న ధర్మశాల లోను ఐదు మ్యాచ్లు పెట్టారు. కానీ పంజాబ్లోనీ మొహాలి స్టేడియంలో మాత్రం వరల్డ్ కప్ కి సంబంధించిన ఒక్క మ్యాచ్ ను కూడా పెట్టలేదు. ఇక క్రీడల్లోనూ రాజకీయాలు చేస్తున్నారు అంటూ పంజాబ్ క్రీడామంత్రి గుర్మీత్ సింగ్ విమర్శలు గుప్పించాడు . కాగా నరేంద్ర మోడీ స్టేడియంలో అటు వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ జరగబోతుంది. అదే సమయంలో ఇక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇక్కడే జరగబోతుంది అని చెప్పాలి. ఇక క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ కు కూడా నరేంద్ర మోడీ స్టేడియం  ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: