గాయం నుంచి కోలుకున్న బుమ్రా.. రోజు ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడంటే?

frame గాయం నుంచి కోలుకున్న బుమ్రా.. రోజు ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడంటే?

praveen
టీమిండియాలో కీలక బౌలర్గా కొనసాగుతున్న జస్ ప్రీత్ బుమ్రా గత కొంతకాలం నుంచి భారత జట్టుకు అందుబాటులో ఉండడం లేదు అన్న విషయం తెలిసిందే. వెన్నుముక గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా మధ్యలో గాయం నుంచి కోలుకొని మళ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. కానీ ఒకటి, రెండు మ్యాచ్లు మాత్రమే ఆడి మళ్లీ పాత గాయం తిరగబెట్టడంతో ఇక జట్టుకు దూరమయ్యాడు. అయితే ఇక తన గాయానికి శాశ్వత పరిష్కారం చూపించాలి అని నిర్ణయించుకుని చివరికి సర్జరీ చేసుకోవడానికి సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే.


 ఇక వెన్నుముక గాయానికి సర్జరీ చేసుకున్న బుమ్రా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. అయితే బుమ్రా ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకొని.. అటు ఫిట్నెస్ సాధించే పనిలో బిజీగా ఉన్నాడు అన్నది తెలుస్తుంది. ఈ ఏడాది ఆసియా కప్ వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలు ఆడబోతుంది టీమిండియా. ఇక ఇలాంటి టోర్నీలకు బుమ్రా అందుబాటులో ఉంటే బాగుంటుందని భావిస్తుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే బుమ్రా ఇక మళ్ళీ తిరిగి జట్టులోకి వచ్చేందుకు ప్రస్తుతం ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాడు. మళ్లీ మునుపటి ఫామ్ లోకి వచ్చి టీమిండియాలో చోటును సుస్థిరం చేసుకోవాలని అనుకుంటున్నాడు.



 ఈ క్రమంలోనే బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బౌలింగ్ ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాడట ఈ ఫాస్ట్ బౌలర్. రోజుకు 7 ఓవర్ల చొప్పున బౌలింగ్ చేస్తున్నట్లు అకాడమీ వర్గాలు చెబుతున్నాయి. అయితే క్రమక్రమంగా భారాన్ని పెంచుతూ ఇక వచ్చే నెలలో ప్రాక్టీస్ మ్యాచ్  ఆడబోతున్నట్లు బిసిసిఐ వర్గాలు చెబుతున్నాయి. ఆసియా కప్ కంటే ముందు ఐర్లాండ్తో టీమిండియా ఆడబోయే టి20 సిరీస్ లో ఇక బుమ్రా జట్టులోకి చేరే అవకాశాలు ఉన్నాయి అన్నది తెలుస్తోంది. ఇక ఐర్లాండ్ టి20 సిరీస్లో బుమ్రా మునుపటి ఫామ్ నిరూపించుకుంటే.. వెంటనే అతన్ని ఇక ఆసియా కప్ తో పాటు వరల్డ్ కప్ లో కూడా సెలెక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: