వరల్డ్ కప్ 2023లో.. సెమీ ఫైనలిస్ట్ టీమ్స్ ఇవేనట?

praveen
ఈ ఏడా  భారత్ వేదికగా  వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇక వన్డే వరల్డ్ కప్ కి సంబంధించి ఇటీవలే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ షెడ్యూల్ ని కూడా విడుదల చేసింది. ఇక ఈ షెడ్యూల్ నేపథ్యంలో ఎప్పుడు ఏ ప్రత్యర్థిని ఎదుర్కోబోతున్నాము అనే విషయంపై ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది అని చెప్పాలి. దీంతో ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి అన్ని టీమ్స్.


 అయితే భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్ ని ఐసిసి ప్రకటించిన నేపథ్యంలో ఎంతో మంది మాజీ ఆటగాళ్లు మరోసారి తమ విశ్లేషణలకు పని పెట్టారు. సాధారణ మ్యాచ్ జరుగుతుంటేనే ఇక ఆ మ్యాచ్ లో విజేత ఎవరు అనే విషయంపై రివ్యూలు ఇచ్చే మాజీ ఆటగాళ్లు.. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ మ్యాచ్ నేపద్యంలో ఇక ఎవరు సెమీఫైనల్కు వెళ్తారూ.. ఎవరు వరల్డ్ కప్ విజేతగా నిలుస్తారు అనే విషయంపై తెగ రివ్యూలు ఇచ్చేస్తున్నారు అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ముత్తయ్య మురళీధరన్ స్పందిస్తూ ఇక వరల్డ్ కప్ లో సెమీఫైనల్ కు వెళ్లబోయే నాలుగు టీమ్స్ ఏవి అనే విషయంపై రివ్యూ ఇచ్చేశారు. వన్డే వరల్డ్ కప్ 2023 సెమీఫైనలిస్టులుగా ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టీమ్స్ ఉంటాయని ఈ లెజెండరీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు అని చెప్పాలి. ఇక కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా ఇదే విషయంపై స్పందిస్తూ రివ్యూలు ఇవ్వబోతున్నారు. కాగా మరో వంద రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కానుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: