టీమిండియాకు చుక్కలు చూపిస్తా.. వెస్టిండీస్ బ్యాటర్ కామెంట్స్?
అయితే జూలై 12వ తేదీ నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇక జూలై మొదటి వారంలోనే అటు టీమ్ ఇండియా కరేబియన్ గడ్డపై అడుగుపెట్టి అక్కడ ప్రాక్టీస్ లో మునిగితేలే అవకాశం ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ సిరీస్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఇక ఇదే విషయం గురించి వెస్టిండీస్ స్టార్ బాట్స్మన్ జర్మన్ బ్లాక్ వుడ్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత్ తో జరగబోయే టెస్టు సిరీస్ లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ బ్లాక్ వుడ్ తెలిపాడు.
కాగా ఈ 31 ఏళ్ల ప్లేయర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు. బ్లాక్ వుడ్ దేశవాలి క్రికెట్ లో పరుగుల వరద పారిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఇదే జోరును అటు టీమిండియా తో జరగబోయే టెస్ట్ మ్యాచ్లో కూడా కొనసాగిస్తానని అతను నమ్మకంగా చెబుతున్నాడు. భారత్తో టెస్ట్ సిరీస్ కి ఆత్రుతగా ఎదురు చూస్తున్న. నేను చివరిసారి భారత్తో ఆడినప్పుడు అంతగా రాణించలేకపోయాను. కానీ ఈసారి మాత్రం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న. ఈ సిరీస్ కోసం ఎంతో కష్టపడ్డాను. భారీ స్కోర్లు తప్పకుండా సాధిస్తాను. ఇక గత రెండేళ్లుగా మేము టెస్టుల్లో మంచి గణాంకాలు నమోదు చేస్తున్నాం అంటూ బ్లాక్ వుడ్ చెప్పుకొచ్చాడు. ఈసారి తప్పకుండా భారత్ పై గెలిచి సత్తా చాటాలి అనుకుంటున్నాం. సొంతం గడ్డపై తప్పకుండా టీమ్ ఇండియాని ఓడిస్తాం అంటూ ధీమా వ్యక్తం చేశాడు.