డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్?
మహిళా క్రికెట్కు ఉన్న ఆదరణ పెంచేందుకు ఆయా క్రికెట్ బోర్డులు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికీ ఎందుకో మహిళల క్రికెట్ ను చూసే ప్రేక్షకుల సంఖ్య మాత్రం రోజు రోజుకి తగ్గిపోతుంది తప్ప పెరగడం లేదు. దీంతో ఇక ఎంతోమంది ఉమెన్ ప్లేయర్స్ ఎంత మంచి రికార్డులు సాధించినప్పటికీ కూడా.. వారి ప్రతిభను గుర్తించే వారే లేకుండా పోయారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ ఒక అరుదైన రికార్డు సృష్టించగా.. ఎవరు కూడా పెద్దగా ఈ విషయం గురించి మాట్లాడటం లేదు. మహిళా క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును సృష్టించింది ఇంగ్లాండ్ ఉమెన్ క్రికెటర్ టామీ బ్యూమంట్.
ఇంగ్లాండ్ జట్టు తరుపున టెస్ట్ ఫార్మాట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్ గా కూడా ఒక అరుదైన రికార్డును సృష్టించింది అని చెప్పాలి. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ యాషెష్ టెస్టులో బ్యుమాంట్ 208 పరుగులు చేసింది. 1935లో ఇంగ్లాండ్ ప్లేయర్ బెట్టిస్ స్నోబాల్ 189 పరుగులు చేయగా నిన్నటి వరకు కూడా ఇక ఇదే మహిళల టెస్ట్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ గా నిలిచింది. కానీ ఇప్పుడు బ్యూమంట్ ఏకంగా 208 పరుగులు చేసి ఈ రికార్డును బద్దలు కొట్టింది అని చెప్పాలి. ఇంగ్లాండ్ తరఫున ఇప్పటివరకు అత్యధిక స్కోర్ ఇదే కావడం గమనార్హం. ఇలా డబుల్ సెంచరీ తో రికార్డు సృష్టించిన ఆమె ప్రదర్శన గురించి మాట్లాడే వారే కరువయ్యారు.