తొలి మ్యాచ్ పిచ్.. నాకు పెద్ద శత్రువులా కనిపించింది : అండర్సన్
ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా ఈ యాషెష్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా తమకు అనుకూలంగా పిచ్ లను తయారు చేసుకుంటుందని.. ఇక ఎంతోమంది ఇంగ్లాండ్ మాజీలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు అని చెప్పాలి. ఇదే విషయం గురించి ఇంగ్లాండు వెటరన్ ఫేసర్ జేమ్స్ అండర్సన్ స్పందిస్తూ.. తొలి టెస్ట్ మ్యాచ్ కు వేదికైన ఎడ్జ్ బస్టాన్ లో ఉన్న పిచ్ గురించి అసహనం వ్యక్తం చేశాడు. ప్రతిష్టాత్మకమైన సిరీస్ కోసం జీవం లేని పిచ్ తయారు చేశారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. మిగతా మ్యాచ్లలో కూడా ఇలాంటి పిచ్ లే ఉంటే తన కథ ముగిసినట్లే అంటూ పేర్కొన్నాడు.
ఎడ్జ్ బాస్టన్ లో తయారుచేసిన పిచ్ నాకు శత్రువుల కనిపించింది. దీనిపై స్వింగ్, రివర్స్ స్వింగ్, సీమ్ కదలిక, బౌన్స్, ఫేస్ ఇలా ఏది రాబట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. ఎన్నో ఏళ్లుగా కష్టపడి ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేసేలా నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాను. కానీ అన్ని రకాలుగా ప్రయత్నించిన ఇక ఫలితం మాత్రం రాబట్ట లేకపోయాను. ఏకంగా బౌలింగ్ చేస్తున్నంత సేపు కఠినమైన యుద్ధం చేస్తున్నానేమో అని అనిపించింది అంటూ అండర్సన్ చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియా గెలిచిన ఈ తొలి మ్యాచ్లో అండర్సన్ లాంటి అత్యుత్తమ బౌలర్ కేవలం ఒకే ఒక వికెట్ మాత్రమే పడగొట్టగలిగాడు అని చెప్పాలి.