రెండో టెస్ట్ మ్యాచ్.. కొత్త అస్త్రంతో బరిలోకి ఇంగ్లాండ్?

praveen
ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్తిగా కొనసాగుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన యాషేష్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటికి మొన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ పై పూర్తి పై చేయి సాధించి ఇక ఫైనల్లో విజయంతో విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ఇక ఇప్పుడు యాషెష్ సిరీస్ లో కూడా అదే రీతిలో జోరు చూపిస్తుంది. అయితే బజ్ బాల్ అనే ఎటాకింగ్ గేమ్ ద్వారా ఆస్ట్రేలియాను బోల్తా కొట్టించాలని భావించిన ఇంగ్లాండ్ చివరికి మొదటి టెస్ట్ మ్యాచ్ లో బొక్క బోర్లా పడి ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే.



 అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ లో పరాభవానికి ప్రతి కారం తీర్చుకునేందుకు ప్రస్తుతం ఇంగ్లాండ్ సేన సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఆతిథ్య  ఆస్ట్రేలియాపై కొత్త అస్త్రాన్ని ప్రయోగించేందుకు ఇంగ్లాండ్ సిద్ధమయిందట. ఇటీవల జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ సీనియర్ ఆల్రౌండర్ మోయిన్ అలీ గాయపడ్డాడు. చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇక మొదటి మ్యాచ్ లోనే గాయపడ్డాడు. దీంతో అతనికి బ్యాకప్ గా 18 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ను బలిలోకి దింపేందుకు ఇంగ్లాండు టీమ్ సిద్ధమైందట. లార్డ్స్ వేదికగా ఈనెల 28వ తేదీన మొదలయ్యే రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగాలని సిద్ధమైంది.



 ఈ క్రమంలోనే మోయిన్ అలి స్థానంలో 18 ఏళ్ల లెగ్ స్పిన్నర్ రేహేన్ అహ్మద్ ను జట్టులోకి తీసుకుందట. మొదట లియాన్ దాసన్ ను తీసుకోవాలని అనుకున్నప్పటికీ.. ఇక ఆల్రౌండర్ అయిన రెహాన్ వైపే కోచ్ మేకళ్ళమ్ కెప్టెన్ స్టోక్స్ కూడా మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే ఈ యంగ్ స్టార్ అరంగేట్రం మ్యాచ్లోనే పాకిస్తాన్ పై ఏడు వికెట్లు తీసాడు. అంతేకాదు గత ఏడాది అండర్ 19 ప్రపంచకప్ లో కూడా సత్తా చాటాడు అని చెప్పాలి. మరి ఇంగ్లాండు బరిలోకి దింపుతున్న ఈ కొత్త ఆస్త్రాన్ని అటు ఆస్ట్రేలియా ఎలా ఎదుర్కోబోతుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: