వారెవ్వా.. టీమిండియాకు.. మరో సూపర్ ఆల్ రౌండర్ దొరికేశాడుగా?

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్లో యంగ్ క్రికెటర్స్ దే ఎక్కువగా హవా నడుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో అనుభవం ఉన్న సీనియర్ క్రికెటర్లు ఇక బాగా రాణించడంలో ఇబ్బంది పడుతూ ఉంటే.. ఎంతో మంది యంగ్ క్రికెటర్స్ మాత్రం అదరగొడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మాత్రమే కాదు దేశవాలి క్రికెట్ లో కూడా ప్రతి లీగ్ లో యంగ్ క్రికెటర్స్ సృష్టిస్తున్న విధ్వంసం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

 ఇలా ఎవరైనా ఆటగాడు మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేసి అదరగొట్టాడు అంటే చాలు ఇక భారత క్రికెట్లో ఫ్యూచర్ స్టార్స్ కి కొదవ లేకుండా పోయింది అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది. ఇప్పటికే దేశ వాలి క్రికెట్ నుంచి ఐపీఎల్ లోకి అడుగుపెట్టి ఎంతో మంది అదరగొట్టారు అన్న విషయం తెలిసిందే. ఇక కొంతమంది ఐపీఎల్లో ఛాన్స్ దక్కించుకోని వారు  నిరాశ చెందకుండా దేశవాళి క్రికెట్ లో వచ్చిన ఛాన్సులను వినియోగించుకుంటూ దుమ్ము దులిపేస్తున్నారు. ఇటీవలే మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ లో కూడా ఒక యంగ్ ప్లేయర్ ఇలాగే సూపర్ సెంచరీ తో చెలరేగిపోయాడు అని చెప్పాలి.

 ప్రస్తుతం మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ ఉత్కంఠ మరితంగా సాగుతుంది. ఇకపోతే ఇటీవల ఈగల్ నాసిక్ టైటాన్స్ ఆటగాడు అర్షిన్ కులకర్ణి తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. పూనేరి బప్ప టీం తో జరిగిన మ్యాచ్లో 54 బంతుల్లోనే 117 పరుగులు చేసి సెంచరీ తో చెలరేగిపోయాడు. ఇందులో 13 సిక్సర్లు  మూడు ఫోర్లు ఉండడం గమనార్హం. అయితే కేవలం బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోను తన సత్తా ఏంటో చూపించాడు. ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్లో పునేరి టీం ఆరు పరుగులు చేయాల్సి ఉండగా.. అర్షిన్ నాలుగు రన్స్ మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో అతని ఇన్నింగ్స్ గురించి తెలిసి టీమిండియా కు  మరో నికార్సైన ఆల్ రౌండర్ దొరికేశాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: