భారత్‌కి పాక్ ఆటగాళ్లు వెళ్ళకూడదు.. మాజీ దిగ్గజ బ్యాటర్ వ్యాఖ్యలు?

praveen
క్రికెట్ లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కి ఉండే క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే హోరాహోరీ తప్పదు. క్రికెట్ ప్రేమికులు టీవీలకు అతుక్కుపోతారు. అయితే ఇప్పుడు పాక్ మాజీ దిగ్గజ బ్యాటర్ జావేద్ మియాందాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్‌కి టీమిండియాను పంపేందుకు బీసీసీఐ అంగీకరించే వరకు.. ఈ ఏడాది జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ కోసం భారత్‌కి పాక్ ఆటగాళ్లు వెళ్లకూడదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. వన్ డే వరల్డ్ కప్ ఇండియాలో జరగనుందనే విషయం అందరికి తెలిసిందే. ఇండియా పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 15న పాక్, భారత్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో షెడ్యూల్ చేసారు.

అయితే జావేద్ మియాందాద్ మాట్లాడుతూ పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత్‌ రాకపోతే పాక్ నిర్ణయం తీసుకునేందుకు సమయం ఆసన్నమైందని.. 2012, 2016లో భారత్‌కి పాకిస్థాన్‌ వచ్చిందని, ఇప్పుడు టీమిండియా వంతు. ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌కి భారత్ ప్లేయర్లు రాకపోతే నరకానికి పోతారు' అని అన్నారు. 'నా నిర్ణయం అయితే ఏ ఒక్క మ్యాచ్ ఆడడానికి కూడా నేను భారత్‌కి వెళ్లను, అది ప్రపంచ కప్ అయినా సరే కూడా. మేము టీమిండియాతో ఆడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము, కానీ వారు ఎప్పుడూ అదే రీతిలో స్పందించలేదు. పాకిస్థాన్ క్రికెట్ పెద్దది.. మేము ఇప్పటికీ నాణ్యమైన క్రికెటర్లను తయారు చేస్తున్నాం. కాబట్టి మనం భారత్‌కి వెళ్లక పోతే మనకు నష్టం కలుగుతుందని నేను అనుకోను. క్రీడలను రాజకీయాలతో కలపకూడదు. క్రికెట్ అనేది ప్రజలను దగ్గర చేసే ఒక ఆట' అని మియాందాద్ పేర్కొన్నారు.

భారత్ చివరిగా 2008లో ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌లో పర్యటించిన విషయం కూడా తెలిసిందే. అయితే ఆ టోర్నీ జరిగి 6 నెలలకు కూడా కాకముందే ముంబైలో 26/11 దాడులు సంచలనాన్ని సృష్టించాయి. ఇప్పటికి ఆ విజువల్స్ కళ్ళ ముందే ఉంటాయి. దీంతో భారత్ - పాక్ మధ్య జరిగే మ్యాచ్ లు కూడా ఆగిపోయాయి. ఈ రెండు జట్లు ఇతర దేశాలలో జరిగే ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: