ఎంత మోసం.. బంతి నేలకు తాకిందని ఒప్పుకున్న ఆసిస్ మాజీ?

praveen
?
ఆదివారం జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమ్‌ ఇండియా దారుణమైన ఓటమిని చవిచూసింది. 444 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 234 పరుగులకే తట్టాబుట్టా సర్దేసుకుంది. అయితే ఈ క్రికెట్ మ్యాచ్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేసేందుకు కెమెరూన్ గ్రీన్ పట్టిన క్యాచ్ వివాదాస్పదంగా మారింది. అసలు ఇది ఔటే కాదని రిప్లై లో స్పష్టంగా తెలిసింది. థర్డ్ అంపైర్ రివ్యూలో కూడా బంతి నేలను తాకినట్లు కనిపించింది. అయినా దానిని ఔట్ అని థర్డ్ అంపైర్ తీర్పు ఇవ్వడంతో శుభ్‌మన్ గిల్‌ పెవిలియన్ బాట పట్టక తప్పలేదు.
ఈ క్యాచ్ చర్చినీయాంశం కూడా అయింది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ క్యాచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బంతి నేలను తాకిందని తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. అయితే క్యాచ్ ఔట్ గురించి ఆన్-ఫీల్డ్ అంపైర్లు గందరగోళంలో పడిపోగా, వారు రిచర్డ్ కెటిల్‌బరో సహాయాన్ని కోరారు. అప్పుడు అతను చివరికి ఆస్ట్రేలియాకు అనుకూలంగా తీర్పు ఇచ్చాడు. ఇలాంటి నిర్ణయంపై అభిప్రాయాలు ఒక్కో టీమ్‌లో ఒక్కొక్కలా పాంటింగ్ అంగీకరించాడు.
అయితే బంతి కొంత భాగాన్ని నేలను తాకినట్లు తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నాడు. "అంపైర్ ప్రకారం బంతిని నేలను తాకడానికి ముందు ఫీల్డర్ దానిపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నంత సేపు అది ఔట్ గానే భావిస్తారు. గిల్ ఔట్ విషయంలో సరిగ్గా ఇదే జరిగి ఉండొచ్చు. ఈ క్యాచ్ చూసినప్పుడు ఆస్ట్రేలియా వారికి బంతి నేలను తాకలేదని, ఇండియా వారికి తాకిందని అనిపిస్తుంది. ఇలా అనిపించడం సహజమే. బంతి నేలని తాకినా అది కింద పడే ముందు ఫీల్డర్ కు దానిపై పూర్తి కంట్రోల్ ఉండి ఉంటుంది. అందువల్ల అంపైర్ ఇచ్చిన ఔట్ అనేది సరైనదేనని నేను భావిస్తున్నాను" అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు మ్యాచ్ తర్వాత, గిల్ అంపైర్, గ్రీన్‌ను సోషల్ మీడియాలో ఎగతాళి చేశాడు. భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కూడా అంపైర్ నిర్ణయాన్ని విమర్శించారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఆటగాళ్లు, అభిమానుల మధ్య వివాదాన్ని, విభిన్న అభిప్రాయాలను సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: