డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి కారణం అదే : హర్భజన్ సింగ్
ఐపీఎల్లో ఫైనల్ మ్యాచ్ వరకు చాలా మంది ఇండియన్ ప్లేయర్లు పాల్గొన్నారని, అయితే ఆస్ట్రేలియన్ ప్లేయర్లు మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్, యాషెస్ సిరీస్‌లకు సన్నద్ధం కావడానికి ఐపీఎల్‌ను తృణప్రాయంగా వదిలేశారని భజ్జి గుర్తు చేశాడు. ఆస్ట్రేలియా తమ సన్నాహాలను ముందుగానే ప్రారంభించిందని, ఐపీఎల్లో తమ ఆటగాళ్లు ఆడకపోవడమే ఆ జట్టుకు ప్రయోజనాన్ని ఇచ్చిందని హర్భజన్ వివరించాడు.
మ్యాచ్‌లో తొలి రోజు మైదానంపై చాలా పచ్చిక ఉన్నా ప్రభావం చూపేందుకు భారత బౌలర్లు ఇబ్బంది పడ్డారని, ట్రావిస్ హెడ్ సెంచరీ చేయడం భారత జట్టుకు పెద్ద తలనొప్పిగా మారిందని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో పోలిస్తే భారత్ సన్నద్ధత అంతగా లేదని హర్భజన్ తన ఇంటర్వ్యూని ముగించాడు.
ఇండియా ఓడిపోయిన తర్వాత గంగూలి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా ఇంకా బలంగా పోరాడి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఐదవ రోజు టీమిండియా బాగా పర్ఫార్మ్ చేస్తుందని తాము ఎక్స్పెక్ట్ చేశామని కానీ రోహిత్ సేన పోరాటం చేయకుండానే నిరాశపరిచిందని పెదవి విరిచాడు.
2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఇండియా ఫైనల్ వరకు చేరుకొని అక్కడ తడబడింది. దాంతో ఆ ఏడాది ఇంగ్లాండ్ జట్టు డబ్ల్యూటీసీ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈసారైనా ఈ కప్పు మనదే అని టీమిండియా ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. మాజీ ప్లేయర్లు చెప్పినట్టు టీమ్ ఇండియా మెంబర్స్ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే.. కనీస పోటీ ఇచ్చి అయినా మనం పరువు దక్కించుకునే వాళ్ళం.