వివాదాస్పద క్యాచ్ పై.. గిల్ సెటైరికల్ ట్విట్ వైరల్?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన 444 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు బలిలోకి దిగింది టీం ఇండియా. ఇక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఇక ప్రస్తుతం కోహ్లీ 44, అజంక్య రహనే 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 280 పరుగుల అవసరం. అయితే రెండో ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్ శుభమన్ గిల్ 18 పరుగులకే అవుట్ అయ్యాడు. బోలాండ్ వేసిన ఎనిమిదో ఓవర్ మొదటి బంతిని స్లిప్ లో కామరూన్ గ్రీన్ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. అయితే ఈ క్యాష్ వివాదాస్పదంగా మారిపోయింది.
బంతి నేలకు తాకిన తర్వాత గ్రీన్ క్యాచ్ అందుకున్నట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం అవుట్ గా ప్రకటించడంతో.. ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. కానీ ఎంపైర్ నిర్ణయంతో.. ఇక గిల్ నిరాశతో పెవిలియన్ చేరక తప్పలేదు. ఇక ఇదే విషయంపై ఎంతోమంది స్పందిస్తూ.. అంపైర్ తప్పుడు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. స్వయంగా గిల్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ సెటైరికల్ ట్విట్ పెట్టాడు. ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. బంతి స్పష్టంగా నేలకు తాకుతున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కాస్త భూతద్దం పెట్టి చూడాల్సింది అన్నట్లుగా అర్థం వచ్చే ఎమోజీలను పోస్ట్ చేశాడు గిల్.. ఇది కాస్త వైరల్ గా మారింది.