కోహ్లీ ఉన్నాడంటే.. టీమ్ ఇండియాదే విజయం : ఆసిస్ మాజీ

praveen
ప్రస్తుతం టీమిండియా జట్టు ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్లో భాగంగా పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కొంటుంది. ఇక ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ లోని ఓవల్ వేదికగా జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో నెలకొంది. రెండో  ఇన్నింగ్స్ ముగించే సమయానికి ఇక ఆస్ట్రేలియా భారత్ ముందు 44 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు మొదట్లోనే తడబడింది.

 రోహిత్ శర్మ శుభమన్ గిల్ తక్కువ పరుగులకే వికెట్ కోల్పోయారు. ఇక ఆదుకుంటాడు అనుకున్న  పూజార సైతం చేతులెత్తేసాడు. దీంతో ఇక 164 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా. ఇక ఇప్పుడు టీమిండియా గెలవాలంటే తప్పక 280 పరుగులు సాధించాల్సి ఉంది అని చెప్పాలి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 40 పరుగులతో క్రీజులో ఉండగా మరోవైపు అజింక్య రహానే కూడా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా విజయం సాధిస్తుందా లేదా అన్న విషయం గురించి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి.

 ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీలు కూడా స్పందిస్తూ రివ్యూ ఇస్తున్నారు. కాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ సైతం ఈ విషయంపై స్పందించాడు. డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ లో చివరి రోజైన నేడు 280 పరుగులు చేస్తేనే భారత్ విజేతగా నిలుస్తుంది. అయితే క్రీజు లో ఉన్న కోహ్లీ పైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉందని ఆస్ట్రేలియా మాజీ జస్టిన్ లాంగర్ అభిప్రాయపడ్డాడు.  విరాట్ కోహ్లీ క్రీజు లో ఉన్నంత సేపు భారత్ గెలిచే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. గొప్ప ప్లేయర్లు అద్భుతాలు చేయగలరు. కోహ్లీ అవుట్ అయ్యే వరకు ఆస్ట్రేలియా రిలాక్స్ అవ్వోద్దు  అంటూ జస్టిన్ లాంగర్ సూచించాడు. కాగా చివరి రోజైన నేడు అటు భారత బ్యాట్స్మెన్లు ఏం చేయబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wtc

సంబంధిత వార్తలు: