వావ్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన ధోని బౌలర్?

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అటు ప్రపంచ క్రికెట్లో ఫ్యూచర్ స్టార్స్ ని అందించే ఒక మంచి వేదికగా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే భారత క్రికెట్కు అటు కొత్త ప్రతిభను పరిచయం చేయడమే కాదు.. వరల్డ్ క్రికెట్లో ఉన్న ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ కు అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టేందుకు ఒక మంచి ఛాన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్లో రాణించిన ఎంతోమంది ఆ తర్వాత కాలంలో తక్కువ సమయంలోనే అటు అంతర్జాతీయ క్రికెట్ లో కూడా ఛాన్స్ దక్కించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.

ఒకరకంగా ప్రస్తుతం భారత జట్టులో కొనసాగుతున్న ప్లేయర్స్ అందరూ కూడా ఒకప్పుడు ఐపీఎల్ లో రాణించి గుర్తింపును సంపాదించుకున్న వారే అనడంలోనూ సందేహం లేదు. ఇక ఇలా ఐపీఎల్లో రాణిస్తే అంతర్జాతీయ క్రికెట్ లో ఛాన్స్ దక్కుతుంది అన్న విషయం ఇటీవలే మరో ప్లేయర్ విషయంలో నిజం అయింది అని చెప్పాలి. 2023 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున శ్రీలంక యంగ్ బౌలర్ మతిషా పతిరణ మంచి ప్రదర్శన చేశాడు. జూనియర్ మలింగ గా పేరు సంపాదించుకున్న పతీరన ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్గా నిలవడంలో ప్రధాన పాత్ర వహించాడు అని చెప్పాలి. తన బలంతో ప్రత్యర్థులను వనికించాడు.

 ఈ క్రమంలోనే ఐపిఎల్ ముగిసిన వెంటనే ఏకంగా శ్రీలంక టీం తరఫున వన్డే ఫార్మాట్లోకి అరంగేట్రం  చేశాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు శ్రీలంక ఆడబోయే ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్ టోర్నీలో కూడా ఆడే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. అయితే ఇక ఇప్పుడు జరగబోయే వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లలో పతిరణ  మంచి ప్రదర్శన చేశాడు అంటే ఇక భారత్ వేదికగా జరిగే వరల్డ్ కప్ మ్యాచ్లో కూడా అతను శ్రీలంక టీం తరపున ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: