సెంటిమెంట్ : అతను సెంచరీ చేశాడా.. టీమిండియా గెలిచినట్టే?

praveen
ప్రపంచ క్రికెట్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ కి ప్రస్తుతం సమయం ఆసన్నమైంది . వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఇంగ్లాండులోని ఓవర్ మైదానం ఈ మహాసంగ్రామానికి ఆతిథ్యం ఇస్తుంది. ఇక నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. జూన్ 11వ తేదీ వరకు కూడా ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ ఫైనల్ లో గెలిచి విశ్వ విజేతగా గద ఎత్తుకోబోయే టీం ఏది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇరు జట్ల బలాబలాలు, ఇక తుది జట్ల కూర్పు గురించి ఎన్నో రివ్యూలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఈ రివ్యూలు అటు డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ పై మరింత అంచనాలను పెంచేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక టీమిండియా ఫ్యాన్స్ సంతోషంలో ముంచేసే ఒక న్యూస్ వైరల్ గా మారిపోయింది. అదేంటంటే టీమిండియా బ్యాట్స్మెన్ అజింక్య రహానే టెస్ట్ ఫార్మాట్లో సెంచరీ చేసిన ప్రతిసారి కూడా టీమిండియా విజయం సాధించింది. రహనే టెస్ట్ కెరియర్ లో 12 సెంచరీలు చేయగా.. వాటిలో టీమ్ ఇండియా 9 మ్యాచ్ లలో గెలుపొంది మూడు మ్యాచ్ లలో డ్రా చేసుకుంది.

 ఇలా రహానే సెంచరీ చేసిన ఒక్కసారి కూడా టీమిండియా ఓడిపోలేదు. ఇక ఈ సెంటిమెంట్ ప్రస్తుతం టీమిండియా ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచేస్తుంది. ఐపిఎల్ 2023లో అజింక్య రహనే ఎంతటి విధ్వంసాన్ని సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా దూకుడు అయిన ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో ఫుల్ ఫామ్ లో ఉన్న  రహానే ఇక డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో ఎంతో అలవోకగా సెంచరీ  చేయడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇదే జరిగితే టీం ఇండియా గెలుపు గ్యారెంటీ అని ధీమాగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: