ఆర్సిబి కెప్టెన్ మారే ఛాన్స్.. కొత్త సారథి ఎవరంటే?

praveen
ఐపీఎల్ లో ఛాంపియన్ టీమ్స్ గా కొనసాగుతున్నాయి ముంబై ఇండియన్స్.. చెన్నై సూపర్ కింగ్స్. ఐదుసార్లు టైటిల్స్ గెలుచుకొని ఇప్పటికే సత్తా చాటాయి. దీంతో ఈ రెండు జట్లకి అటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్ లో ఉంది. కానీ ఐపిఎల్ లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవక పోయినప్పటికీ.. ఛాంపియన్ టీమ్స్ తో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న టీం ఏదైనా ఉంది అంటే అది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం అని చెప్పాలి. అయితే ప్రతి ఏడాది టైటిల్ ఫేవరెట్ గానే బరిలోకి దిగుతూ ఉంటుంది. ఈ జట్టు ఈసాల కప్ నమ్దే అనే నినాదంతో బలిలోకి దిగి rcb ప్రతిసారి నిరాశ పరుస్తూనే ఉంటుంది.

 2023 ఐపీఎల్ సీజన్లోనూ ఇదే రిపీట్ అయింది. ఈసారి అయితే ఏకంగా లీగ్ దశ నుంచి నిష్క్రమించింది. 14 మ్యాచ్లలో  ఏడు విజయాలు మాత్రమే సాధించిన ఆర్సిబి కనీసం ప్లే ఆఫ్ లో కూడా అడుగు పెట్టలేకపోయింది. ఈ క్రమంలోనే జట్టు నాయకత్వం పై మళ్లీ ప్రశ్నలు తీర మీదికి వచ్చాయి. అయితే ఈసారి ఆర్సిబి సొంత గడ్డపై ఏడు మ్యాచ్లు ఆడితే కేవలం మూడు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది   2019 తర్వాత ఆర్సిబి టీం లీగ్ దశ నుండి నిష్క్రమించడం ఇది తొలిసారి. దీంతో డూప్లెసెస్ నాయకత్వం పై సందేహాలు వస్తున్నాయి.

 అయితే 2023 సీజన్లో పక్కెముకలు గాయంతో కొన్ని మ్యాచ్లకు డూప్లెసెస్ దూరమైన సమయంలో విరాట్ కోహ్లీ మళ్ళీ ఆర్సీబీ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి అదరగొట్టాడు. మరోసారి తన దూకుడైన కెప్టెన్సీ తో ఇక జట్టుకు విజయాలను అందించాడు అని చెప్పాలి. దీంతో ఇక మళ్లీ ఆర్సిబి జట్టుకు కెప్టెన్ మార్చాల్సిన అవసరం వచ్చిందంటూ వార్తలు తెర మీదకి వచ్చాయి. డూప్లెసెస్ ని కెప్టెన్ గా తప్పించి మళ్లీ కోహ్లీకి బెంగళూరు యాజమాన్యం పట్టం కట్టబోతుందా అనే ప్రశ్న తెరమీదకి వచ్చింది. ఒకప్పటిలా భారత జట్టు కెప్టెన్సీ భారం కూడా లేదు. కాబట్టి కోహ్లీ బెంగళూరు జట్టును మరింత విజయవంతంగా ముందుకు నడిపిస్తాడని కొంతమంది అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి వచ్చే సీజన్ నాటికి ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: