డబ్ల్యూటీసి టోర్ని.. బెస్ట్ టీం ఇదే : ఆసిస్ బోర్డు

praveen
ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గా కొనసాగుతున్న ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య రేపటి నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇప్పటికే ఇరు జట్లు కూడా పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో వరల్డ్ చాంపియన్గా నిలిచాయి.  కానీ సంప్రదాయమైన టెస్ట్ ఫార్మాట్లో మాత్రం వరల్డ్ ఛాంపియన్గా నిలవలేదు. దీంతో ఇప్పుడు డబ్ల్యూటీసి ఫైనల్ లో విజయం సాధించి ప్రపంచ క్రికెట్లో చరిత్ర సృష్టించాలని రెండు జట్లు ఎంతో ఆతృతగా ఉన్నాయి అని చెప్పాలి.

 ఇప్పటికే ఇంగ్లాండు గడ్డపై ప్రాక్టీస్ లో మునిగితేలి చెమటోడ్చిన ఇరుజట్లు ఇప్పుడు ఇక అధికారిక మ్యాచ్లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్కు అటు ఇంగ్లాండ్ లోని ఓవర్ మైదానం ఆతిథ్యం ఇస్తూ ఉంది. జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది మాజీ ప్లేయర్స్ ఫైనల్ మ్యాచ్ గురించి స్పందిస్తూ తమ ప్లేయింగ్ 11 టీమ్స్ ని ప్రకటిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే తుది జట్టు కూర్పు ఎలా ఉంటుంది అనే విషయంపై పలు సూచనలు కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల అటు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా ఇలా ప్లేయింగ్ జట్టును ప్రకటించింది.

 అయితే కేవలం ఒక జట్టుకు సంబంధించి ప్లేయింగ్ ఎలివేంట్ టీం కాదు పూర్తిగా డబ్ల్యూటీసి ఛాంపియన్ షిప్ ట్రోఫీలో మంచి ప్రదర్శన చేసిన ప్లేయర్స్ అందరిని కలిపి ప్లేయింగ్ 11 టీమ్ తయారు చేసింది. అయితే ఈ జాబితాలో ఆశ్చర్యకరంగా క్రికెట్ ఆస్ట్రేలియా రిషబ్ పంతుకు చోటు కల్పించింది అని చెప్పాలి. ఇక మరో విచిత్రం ఏమిటంటే.. టీమిండియా కీ ప్లేయర్లు రోహిత్, కోహ్లీ పూజారాలకు ఈ జాబితాలో చోటు లేకపోవడం గమనార్హం. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన ప్లేయింగ్ టీం వివరాలు చూసుకుంటే.. కవాజా, కరుణ రత్నే, బాబర్, జో రూట్, హెడ్, జడేజా, పంత్, అశ్విన్, కమిన్స్, రాబాడ, అండర్సన్లకు ఇక ఆస్ట్రేలియా డబ్ల్యూటీసి టోర్నీ బెస్ట్ టీం లో చోటు కల్పించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wtc

సంబంధిత వార్తలు: