నేను గుజరాతి.. కానీ చెన్నై గెలవాలని కోరుకుంటున్నా : ఇర్ఫాన్

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అనే విషయం తెలిసిందే. గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ ఉండబోతుంది. ఇక సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది అని చెప్పాలి. అయితే ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు నుంచి ఇక ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. అయితే ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో భాగంగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య పోరు జరగబోతుంది.

 ప్రస్తుతం ఇరుజట్లు కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్పాలి. దీంతో ఇక ఫైనల్ లో విజేతగా నిలవబోయే టీం ఏది అన్నది కూడా ముందుగా ఊహించడం ఎంతో కష్టతరంగా మారిపోయింది. అంతేకాదు ఫైనల్ మ్యాచ్ పై భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోయాయి అని చెప్పాలి. ఇక ఎంతోమంది మాజీ ప్లేయర్స్ సైతం ఫైనల్లో ఎవరు బాగా రాణిస్తారు.. తమ మద్దతు ఎవరికి ఉంటుంది అనే విషయంపై స్పందిస్తూ ఇక సోషల్ మీడియాలో తెగ రివ్యూ ఇచ్చేస్తూ ఉన్నారు. ఇక ఎక్కువ మంది భారత క్రికెట్ ప్రేక్షకులు అయితే ధోని టైటిల్ గెలిస్తే చూడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ధోనీకి ఇదే చివరి మ్యాచ్ అని ప్రచారం నేపథ్యంలో ఇక టైటిల్ గెలిస్తే ధోనికి ఘనమైన వీడ్కోలు లభిస్తుంది అని అనుకుంటున్నారు.


 ఇకపోతే ఇదే విషయంపై అటు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేడు గుజరాత్, చెన్నై మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్ తనకు ఎమోషనల్ అని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. నేను గుజరాతి బిడ్డగా ఆ జట్టు గెలవాలని అనుకుంటున్నా. అయితే నా మనసు మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలని కోరుకుంటుంది. నా ఆలోచన ధోని వైపే వెళుతుంది. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ జట్టు టైటిల్ గెలవాలని కోరుకుంటున్నా. అయితే చెన్నైతో పోల్చి చూస్తే గుజరాత్ బ్యాటింగ్ బౌలింగ్లో ఎంతో పటిష్టంగా ఉంది అంటూ ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. కాగా గుజరాత్ ఒకసారి టైటిల్ గెలిచిన టీం గా ఉండగా చెన్నై.. నాలుగు సార్లు టైటిల్ విన్నర్ గా కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: