ముంబైతో ఫైనల్ ఆడితేనే.. అసలైన కిక్ ఉంటుంది : చెన్నై బౌలర్

praveen
ఎన్ని రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతూ వస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపీఎల్లో గెలవబోయే టీం ఏది అనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. అయితే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో భాగంగా అటు గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ అడుగుపెట్టింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలబడబోయే మరో టీం ఏది అనే విషయంపై కూడా అందరూ చర్చించుకుంటున్నారు.

 ఈ క్రమంలోనే అటు లక్నో జట్టును ఓడించిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ లో ముందడుగు వేసింది. ఈ క్రమంలోనే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్ తో ఫైనల్ లో అడుగు పెట్టేందుకు నేడు మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి. ఇక ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తే ఇక వారు ఫైనల్ లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో మ్యాచ్ ఆడే ఛాన్స్ దక్కించుకుంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే చెన్నైకి ప్రత్యర్థి ఎవరైతే బాగుంటుంది అనే విషయంపై కూడా ఎంతోమంది రివ్యూలు ఇస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ దీపక్ చాహర్  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ఫైనల్లో ముంబై ఇండియన్స్ జట్టుతో తలబడితేనే అసలు మజా ఉంటుంది అంటూ దీపక్ చాహార్ తెలిపాడు. అయితే ఫైనల్ కు ఎవరు వచ్చినా పరవాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. తాము గెలుపును లక్ష్యంగా పెట్టుకుని తాము ముందుకు వెళ్తాము అంటూ తెలిపాడు. మైదానంలో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నుంచి పూర్తిగా మద్దతు ఉంది అంటూ తెలిపాడు. ఇకపోతే ఈ సీజన్ ఆరంభం సమయంలో బౌలింగ్తో పెద్దగా ప్రభావం చూపలేక నిరాశపరచిన దీపక్ చాహార్.. ఇక గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న మ్యాచ్లలో మాత్రం మంచి ప్రదర్శన చేస్తూ ఇక జట్టు బౌలింగ్ విభాగాన్ని ముందుకు నడిపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: