చెన్నైని విడిచి వెళ్ళను.. కానీ.. ధోని షాకింగ్ కామెంట్స్?

praveen
2023 ఐపీఎల్ ప్రారంభం నుంచి కూడా ధోని అభిమానులను కలవరపెట్టే ఒక ప్రచారం ఊపందుకుంది  అన్న విషయం తెలిసిందే. ఏకంగా మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపిఎల్ సీసన్ అని ఈ సీజన్ ముగిసిన తర్వాత ధోని ఇక ఐపీఎల్ కెరీర్ కు గుడ్ బాయ్ చెప్పేస్తాడు అంటూ వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. అయితే ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ప్రచారం నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడిన కూడా భారీగా తరలి వస్తూ ధోని ఆటను వీక్షించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి.

 అయితే ధోని మాత్రం ఇక తనకు ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. పలుమార్లు ఇదే విషయంపై ప్రశ్నించిన క్లారిటీ లేని సమాధానాలు ఇచ్చి మరింత కన్ఫ్యూజన్లో పడేసాడు మహేంద్ర సింగ్ ధోని. ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇటీవలే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పై  15 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ అడుగుపెట్టింది. ఇకపోతే ఈ మ్యాచ్ విజయం అనంతరం అటు వ్యాఖ్యాత హర్ష భోగ్లే ధోనితో మాట్లాడాడు. ఈ క్రమంలోనే ఇండైరెక్టుగా రిటైర్మెంట్ గురించి ప్రశ్న వేశాడు హర్ష భోగ్లే.

 ఈ సీజన్లో మహేంద్రసింగ్ ధోని ఇక ఐపీఎల్ లో ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాడా హర్ష భోగ్లే ప్రశ్నించగా.. ధోని స్పందిస్తూ ఏమో ఆడుతానో లేదో నాకైతే తెలియదు. దానికి మరో ఎనిమిది నుంచి తొమ్మిది నెలల సమయం ఉంది. అప్పుడు ఆడాలా వద్ద అనే విషయంపై నిర్ణయం తీసుకుంటాను. ఇప్పటినుంచి ఆ విషయం గురించి ఆలోచించి తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకు.. ఒక విషయం మాత్రం కచ్చితంగా.. చెప్పగలను నేను ఎప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ తో ఉంటాను. జట్టును విడిచి వెళ్ళను. అది ఆట రూపంలో కావచ్చు లేదా బయటనుంచి మద్దతు అవ్వచ్చు అంటూ ధోని పేర్కొన్నాడు. దీనిబట్టి చూస్తే ధోని రిటైర్మెంట్ ప్రకటించినా.. చెన్నై జట్టుకు కోచ్గా లేదా మెంటర్ గా వ్యవహరించే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: