
చెన్నై ఓపెనింగ్ జోడి.. అదిరిపోయే రికార్డు?
మంచి ఫామ్ లో కనిపిస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఓపెనింగ్ జోడిగా బలిలోకి దిగి ప్రత్యర్థి బౌలర్ల పై వివిధ విహారం చేస్తున్నారు అని చెప్పాలి. సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోతూ ఇక చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రతి మ్యాచ్లో కూడా మంచి ఆరంభాలు అందిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే చెన్నై జట్టు ఎంతో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించిందంటే దానికి వీరిద్దరి ఓపెనింగ్ భాగస్వామ్యాలే కారణం అని చెప్పాలి. అయితే ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో కూడా మరోసారి వీరిద్దరి ఓపెనింగ్ జోడి మంచి ప్రదర్శన చేసింది. ఈ క్రమంలోనే గుజరాత్ తో మ్యాచ్ కి ముందు వరకు కూడా 2023 ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రెండవ ఓపెనింగ్ జోడీగా ఉన్న కాన్వే- గైక్వాడ్ జోడి గుజరాత్ మ్యాచ్ తర్వాత మాత్రం ఒక అరుదైన రికార్డును సృష్టించింది.
ఒక సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఓపెనింగ్ జోడీగా చరిత్ర సృష్టించారు కాన్వే- గైక్వాడ్ జోడి. గతంలో ఈ రికార్డు వీరి పేరు మీదే ఉంది అని చెప్పాలి. ఇక తాజాగా వారి రికార్డును వారే బద్దలు కొట్టారు. ఈ సీజన్లో 15 ఇన్నింగ్స్ లలో కలిపి ఈ జోడి ఏకంగా 865 పరుగులు చేసింది. ఇక అంతకుముందు 16 ఇన్నింగ్స్ లలో కలిపి 688 పరుగులు చేయగా.. ఇక వారి రికార్డును వారే బద్దలు కొట్టారు అని చెప్పాలి. వీరి తర్వాత హస్సి- విజయ్ 533, మేకళ్లమ్- స్మిత్ 513 పరుగుల భాగస్వామ్యాలు అత్యధిక పరుగులుగా ఉన్నాయి.