గెలుపు కోసం.. కోహ్లీ ఏమైనా చేస్తాడు : టామ్ మూడి

praveen
ప్రస్తుతం ఐపీఎల్ లో భాగంగా లీగ్ మ్యాచ్ చివరి దశకు చేరుకున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపీఎల్ పోరు మరింత రసవతంగా మారిపోయింది. ప్లే ఆఫ్ లో అవకాశాన్ని దక్కించుకునేందుకు పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాలలో నిలిచేందుకు అన్ని జట్లు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో పదునైన వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి అని చెప్పాలి. ఇక అదే సమయంలో మరికొన్ని జట్లు పేలవ ప్రదర్శనతో ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయాయి అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ఇటీవల ఐపీఎల్ లో భాగంగా మరో కీలకమైన పోరు జరిగింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం మ్యాచ్ జరిగింది. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ఐపీఎల్ లో ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలి అంటే తప్పకుండా  అన్న విషయం తెలిసిందే. అయితే అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మాత్రం ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే సన్రైజర్స్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక ఈ మ్యాచ్లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది . చివరికి ఈ మ్యాచ్ లో అటు విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది.



 కాగా ఒకవైపు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో క్లాసెస్ సెంచరీ తో చెలరేగిపోయాడు. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ సెంచరీ చేసాడు. అయితే వీరిద్దరిలో క్లాసెస్ సెంచరీ వృధా అవ్వగా.. కోహ్లీ సెంచరీ మాత్రం జట్టుకు విజయాన్ని అందించింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ గురించి సన్రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడి  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు గెలుపు కోసం విరాట్ కోహ్లీ అన్ని విధాలా ప్రయత్నిస్తాడని చెప్పుకొచ్చాడు టామ్ మూడి. ఐపీఎల్ ఫస్ట్ ఆఫ్ లో బెంగళూరు బాగానే ఆడిందని.. సెకండ్ హాఫ్ లో తడబడింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మ్యాక్స్వెల్,డూప్లెసెస్, విరాట్ కోహ్లీ మీదే ఎక్కువగా ఆధారపడుతుందని అభిప్రాయపడ్డాడు టామ్ మూడి. ఏది ఏమైనా ఇటీవల సన్ రైజర్స్ పై విజయంతో అటు ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరచుకుంది బెంగళూరు టీం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: