ఐపీఎల్ హిస్టరీలో.. అరుదైన ఘనత సాధించిన వార్నర్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో భారత క్రికెటర్లతో సమానంగా బెస్ట్ రికార్డులు కలిగి ఉన్న ఏకైక విదేశీ క్రికెటర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఆస్ట్రేలియా స్టార్ ఓపెన్ డేవిడ్ వార్నర్ అని చెప్పాలి. ఐపీఎల్ హిస్టరీలో స్టార్లుగా కొనసాగుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి అత్యుత్తమ క్రికెటర్లు సాధించిన రికార్డులను సైతం విదేశీ క్రికెటర్ అయ్యుండి డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో సాధించాడు. ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ ల జాబితాలో కూడా అతని పేరు ముందు వరుసలోనే ఉంటుంది అని చెప్పాలి.

 అంతే కాదు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్ గాను డేవిడ్ వార్నర్ రికార్డులు సృష్టించాడు. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా మెరుగైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతూ ఉంటాడు డేవిడ్ వార్నర్. ఒకప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడిన ఈ ప్లేయర్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఈ ఏడాది రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్  గాయపడటంతో ఇక డేవిడ్ వార్నర్ చేతికి కెప్టెన్సీ కూడా వచ్చింది. కానీ అందరూ ఊహించినట్లుగా అతని సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపించడంలో విఫలమయ్యాడు. దీంతో ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయింది అని చెప్పాలి.

 అయితే ఇటీవలే 2023 ఐపీఎల్ సీజన్లో మాత్రం అటు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఘనవిజయాన్ని సాధించింది. అయితే ఇక పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ 46 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఒక అరుదైన ఘనత సాధించాడు. అయితే ఈ సీజన్లో పంజాబ్ తో మ్యాచ్ లో కలిపి 430 పరుగులు సాధించాడు వార్నర్. దీంతో ఐపీఎల్ హిస్టరీలో 400 ప్లస్ పరుగులు ఎక్కువసార్లు దాటిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఏకంగా తొమ్మిది సార్లు వార్నర్ 400 ప్లస్ పరుగులు చేశాడు. ఈ ఘనత అందుకున్న నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు రైనా, ధావన్, కోహ్లీలు మాత్రమే 9 సార్లు 400 పరుగులు మార్క్ అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: