ఒకవేళ నేనే గిల్ అయితే.. సెహ్వాగ్ కామెంట్స్ వైరల్?

praveen
టీమిండియా యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ ప్రస్తుతం ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు అని చెప్పాలి. గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ   అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. భారీ స్కోర్లు నమోదు చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఒకరకంగా గుజరాత్ వరస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది అంటే అందులో కీలక పాత్ర వహిస్తుంది యంగ్ ప్లేయర్ శుభమన్ గిల్ అనడంలో సందేహం లేదు. ఇక ఇప్పటివరకు గుజరాత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో 469 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.

 కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయితే 277 పరుగులతో ఇక శుభమన్ గిల్ కు చాలా దూరంలోనే ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక అతని బ్యాటింగ్ విధ్వంసం ముందు అనుభవం ఉన్న బౌలర్లు సైతం తేలిపోతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇక ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్లో కూడా మరోసారి శుభమన్ గిల్ గెలిచి సూపర్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఏకంగా 94 పరుగులు చేశాడు. గిల్ దూకుడు చూస్తే తప్పకుండా సెంచరీ పూర్తి చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ చివర్లో బంతులు తక్కువగా ఉండడం అవకాశం రాకపోవడంతో గిల్ సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే శుభమన్ గిల్ సూపర్ పర్ఫార్మెన్స్ పై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. చివరి వరకు ఇంకా దూకుడుతో ఆడాలని.. మరిన్ని పరుగులు రాబట్టాలి అంటూ సూచించాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇక ఈ సీజన్ ముగిసే సరికి కనీసం 600 నుంచి 700 పరుగులు చేయాలి అంటూ తెలిపాడు. భారత్ తరపున అన్ని ఫార్మట్లలో ఆడుతున్న గిల్.. ఐపీఎల్ లోను మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. అయితే ఇంకా మెరుగ్గా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నేనే గిల్ అయితే మాత్రం ఇలాంటి ప్రదర్శనతో సంతోషంగా ఉండును. మంచి ఫామ్ లో ఉండి పరుగుల సంఖ్య ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నిస్తా. గిల్ షాట్లు అద్భుతంగా ఆడుతున్నప్పటికీ ఇంకాస్త దూకుడు ప్రదర్శించాలి. ఈ సీజన్లో అతని నుంచి సెంచరీ వస్తుందని ఆశిస్తున్న అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: