ఐపీఎల్ : అంతా అయిపోయింది.. ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు?

praveen
సన్రైజర్స్ జట్టుకు మొన్నటి వరకు ఐపీఎల్ హిస్టరీలో డిపెండెంట్  ఛాంపియన్స్ గా పేరు ఉంది. ఎందుకంటే జట్టులో స్టార్ ప్లేయర్లు లేకపోయినప్పటికీ పటిష్టమైన జట్లకు సైతం సాధ్యం కాని రీతిలో ఒకసారి టైటిల్ విజేతగా నిలిచింది సన్రైజర్స్ హైదరాబాద్. కానీ ఆ తర్వాత మాత్రం సన్రైజర్స్ కి అదృష్టం ఎక్కడ కలిసి రావడం లేదు. మరీ ముఖ్యంగా గత రెండు మూడు సీజన్ల నుంచి అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రత్యర్ధులకు ఎక్కడ పోటీ ఇవ్వకుండా దారుణమైన ప్రదర్శనతో అభిమానులందరినీ కూడా నిరాశ పరుస్తూ ఉంది అని చెప్పాలి.



 అయితే ఇక సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో సన్రైజర్స్ జట్టుకి కెప్టెన్గా వ్యవహరించి మొదటి ప్రయత్నంలోనే కప్పు అందించిన మార్కరమ్ ని హైదరాబాద్ జట్టుకు కూడా కెప్టెన్ గా మార్చింది సన్రైజర్స్ యాజమాన్యం. ఇక ఆ ఆటగాడు కెప్టెన్సీలు అయినా జట్టు అదృష్టం మారుతుంది అని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ 2023 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ ఆట తీరు ఎక్కడా మారలేదు. వరుస పరాజయాలతో సతమతమవుతూ పాయింట్లు పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఇటీవల హోమ్ గ్రౌండ్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా సన్రైజర్స్ గెలిచే మ్యాచ్ లలో ఓడిపోయింది.



 చివర్లో 38 బంతుల్లో 30 పరుగులు కావలసిన సమయంలో సన్రైజర్స్ బ్యాట్స్మెన్లు చిన్న లక్ష్యాన్ని కూడా చేదించలేకపోయారు. దీంతో సన్రైజర్స్ విజయం ముందు బోల్తా పడింది. ఒకానొక  సమయంలో గెలుపు దిశగా సాగుతుండగా వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఐదు పరుగుల తేడాతో ఓటమిపాలు అయింది. అయితే చివరి ఓవర్లో 9 రన్స్ కూడా చేయకపోవడంపై అటు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవలే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు చేతిలో ఓటమితో అటు సన్రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు గల్లంతు అయ్యాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: