అరుదైన హిస్టరీకి.. 12 పరుగుల దూరంలో ఆగిన కోహ్లీ?
అయితే కేవలం అంతర్జాతీయ క్రికెట్లో మాత్రమే కాదు ఐపీఎల్లో కూడా విరాట్ కోహ్లీ తన సత్తా చాటాడు అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఎంతోమంది లెజెండరీ క్రికెటర్లు సాధించిన రికార్డులను అతి తక్కువ సమయం లో అలవోకగా చేదించాడు విరాట్ కోహ్లీ. ఇక సరికొత్తగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను కూడా సృష్టిస్తున్నాడు అని చెప్పాలి. అయితే ఇంత సాధించిన ఇంకా అప్పుడే కొత్తగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఆటగాడిలాగా ఏదో నిరూపించుకోవాలనే కసి విరాట్ కోహ్లీలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది.
ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ టాప్ లో ఉన్నాడు. అయితే ఇటీవలే లక్నోతో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ లో చరిత్ర సృష్టించడానికి కేవలం 12 పరుగుల దూరంలో ఆగిపోయాడు విరాట్ కోహ్లీ. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఇంకో 43 పరుగులు చేస్తే ఏకంగా ఐపీఎల్ హిస్టరీలో 7000 పరుగులు పూర్తి చేసుకున్న ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించేవాడు. అయితే లక్నోతో మ్యాచ్లో ఈ రికార్డు సృష్టిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ కోహ్లీ 31 పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయాడు. దీంతో అరుదైన రికార్డు కి 12 పరుగుల దూరంలో ఆగిపోయాడు అని చెప్పాలి.