డేంజర్ జోన్ లో కోహ్లీ.. అలా జరిగితే నిషేధమే?
అయితే ఇక నేడు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో బెంగళూరు జట్టు మరో రసవతరమైన పోరుకు సిద్ధమైంది అని చెప్పాలి. ఇక వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించిన ఆర్సిబి టీం ఇక మూడో మ్యాచ్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తూ ఉంది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుజట్టు కెప్టెన్గా వ్యవహరించిన వారు డేంజర్ జోన్ లో ఉన్నారా అంటే మాత్రం అవును అనే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో బెంగుళూరు జట్టు రెండుసార్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఒకసారి డూప్లెసెస్ కెప్టెన్ గా ఉన్న సమయంలో స్లో ఓవర్ రేట్ నమోదు అయితే.. కోహ్లీ కెప్టెన్సీలో కూడా దారుణమైన స్లో ఓవర్ రేట్ నమోదయింది.
దీంతో విరాట్ కోహ్లీకి 24 లక్షల జరిమానా పడింది. ఇక జట్టులో ఉన్న ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో కోతపడింది అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ నిబంధనలో ప్రకారం మరోసారి స్లో ఓవర్ రేట్ నమోదయింది అంటే చాలు స్టాండ్ ఇన్ కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీపై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది. అయితే ఒకవేళ డూప్లెసెస్ తర్వాత మ్యాచ్ కి కెప్టెన్గా వ్యవహరిస్తే.. ఈ నిబంధన అతనికి కూడా వర్తిస్తుంది. ఈ క్రమంలోనే ఇలా బెంగుళూరు జట్టుకు కోహ్లీ కెప్టెన్సీ వహించిన.. లేదా డూప్లెసిస్ సారధిగా వ్యవహరించిన స్లో ఓవర్ రేట్ నమోదు కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అని చెప్పాలి.