కింగ్ కోహ్లీ అరుదైన రికార్డు.. ఐపీఎల్ లో ఒకే ఒక్కడు?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ప్లేయర్ల గురించి చర్చ వచ్చినప్పుడల్లా విరాట్ కోహ్లీ పేరే మొదట అందరి నోటా వినిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే తన ప్రదర్శనతో అంతలా అంతర్జాతీయ క్రికెట్లో హవా నడిపిస్తూ ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఇక ఈ టీమిండియా స్టార్ క్రికెటర్ ని అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా రికార్డుల రారాజు అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటివరకు తన కెరియర్ లో విరాట్ కోహ్లీ సాధించని రికార్డు అంటూ లేదు అన్న విధంగా ప్రస్తానాన్ని కొనసాగించాడు.

 ఎంతోమంది లెజెండరీ ప్లేయర్స్ తమ కెరియర్ మొత్తంలో సాధించిన రికార్డులను విరాట్ కోహ్లీ ఇప్పటికే బ్రేక్ చేసి తన పేరును లికించుకున్నాడు అని చెప్పాలి. ఒక్క సచిన్ 100 సెంచరీల రికార్డు తప్ప మిగతా అన్ని రికార్డులను కోహ్లీ బద్దలు కొట్టేశాడు అని చెప్పాలి. ఇన్ని రికార్డులు కొట్టిన తర్వాత కూడా ఇంకా తనలో పరుగులు చేసే కసి అలాగే ఉంది అని ప్రతి మ్యాచ్లో నిరూపిస్తూనే ఉంటాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అత్యుత్తమమైన ప్రదర్శన చేస్తూ ఉంటాడు . ఐపీఎల్ లో ఆర్సిబి తరఫున కూడా ఎన్నో అసాధారణమైన ఇన్నింగ్స్ లు ఆడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

 ఇకపోతే ఇటీవలే పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 24 పరుగులు తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో 30 రన్స్ పూర్తి చేయడంతో కోహ్లీ అరుదైన రికార్డు సృష్టించాడు. 100 సార్లు 30 ప్లస్ స్కోర్ చేసిన తొలి ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఈ విషయాన్ని కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఆల్ టైం అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతేకాదు ఐపీఎల్ లో ఆరు వందల ఫోర్లు కొట్టిన రెండో ప్లేయర్ గాను రికార్డ్ సృష్టించాడు. 730 ఫోర్లతో దావన్ మొదటి స్థానంలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: