వైరల్ : బట్లర్ కి ఐ లవ్ యు చెప్పిన యువతి?
ఇకపోతే ఇటీవల గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ గుజరాత్ హోమ్ గ్రౌండ్ అయినా నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. అయితే ఇక హోమ్ గ్రౌండ్ లోనే అటు గుజరాత్ టైటాన్స్ కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి చవిచూసింది గుజరాత్ జట్టు. సాధారణంగానే హోం గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు తమ అభిమాన జట్టు ఆటగాళ్లలో హుషారు నింపేందుకు ఇక ప్రేక్షకులు భారీగా స్టేడియం కు తరలి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గుజరాత్ కు చెందిన ఒక యువతి మాత్రం అటు రాజస్థాన్ బ్యాట్స్మెన్ కు వీరాభిమానిని అంటూ చెబుతుంది.
గుజరాత్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ కి ముందు ప్రాక్టీస్ సెషన్ జరిగింది. అయితే ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్న రాజస్థాన్ స్టార్ ప్లేయర్ బట్లర్ తన ప్రాక్టీస్ ముగించుకుని వెళ్తున్న సమయంలో ఒక యువతి బట్లర్ వద్దకు వచ్చింది. ఇక అతనితో మాట్లాడుతూ నేను మీకు వీరాభిమానిని.. మీ ఆట అంటే చాలా ఇష్టం.. ఐ లవ్ యు అంటూ తెగ సిగ్గు పడిపోయింది ఆ యువతి. ఇక ఆ యువతి అభిమానానికి మంత్రముగ్ధుడు అయిపోయిన బట్లర్ కాసేపు యువతితో ముచ్చటించాడు. ఐపీఎల్ ఎంజాయ్ చేస్తున్నారా అని అడగ్గా సూపర్ గా ఎంజాయ్ చేస్తున్న.. నాది గుజరాత్ అయినప్పటికీ మీకు పెద్ద ఫ్యాన్ మీకోసమే.. మ్యాచ్ చూడడానికి కూడా వస్తాను అంటూ ఆ యువతి చెప్పింది. ఇక చివరిగా ఆ యువతికి ఒక సెల్ఫీ ఇచ్చాడు బట్లర్. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.