ఆ సత్తా కేవలం శుబ్‌మన్‌ గిల్ కి మాత్రమే వుంది : రవి శాస్త్రి

praveen
ఐపీల్ సీజన్ 2023 మొదలవగానే ఇప్పటికే ఎన్నో సంచలన రికార్డు లు నమోదవుతున్నాయి. గత పదిహేను సీజన్లలో చాల రికార్డు లు కూడా నమోదవ్వగా ఒక సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు మాత్రం మన ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరు మీద వుంది. గతం లో అతడు ఒక సీజన్ లో 973 పరుగులు సాధించాడు. ఈ రికార్డు 2016 లో నమోదయ్యింది. ఇక ఇప్పటి వరకు ఆ రికార్డు ను ఎవరు అధిగమించ లేక పోతున్నారు. అయితే మాజీ క్రికెటర్ రవి శాస్త్రి మాత్రం విరాట్ పేరు మీద ఉన్న ఈ అత్యధిక పరుగుల రికార్డు ని అధిగమించే సత్తా ఉన్న ఆటగాడు కేవలం శుబ్‌మన్‌ గిల్ మాత్రమే అంటున్నాడు. కేవలం ఓపెనర్ గా ఉంటూ పరుగుల వరద పారిస్తేనే ఆ రికార్డు బద్దలు కొట్టడం సాధ్యం అవుతుందని జోష్యం చెప్తున్న రవి శాస్త్రి ప్రస్తుతం ఒక సీజన్ లో 900 కి పరుగులు సాధించడం చాల కష్టం అంటున్నాడు.


 ఆలా చేయాలంటే సగటున మ్యాచ్ కి 80 కి పైగా పరుగులు సాధించాల్సి ఉంటుందని ఓపెనింగ్ చేసే వారికే మాత్రమే అది సాధ్యం అవుతుందని చెప్తున్నారు. పైగా ఒక లీగ్ తో పాటు అదనంగా మరొక రెండు మ్యాచు లు ఆడాల్సి ఉంటుందని చెప్తున్నారు రవి శాస్త్రి . యువ ఓపెనర్ గా ఉన్న శుబ్‌మన్‌ గిల్ సైతం మంచి స్థరత్వం తో కూడిన ఆట ఆడుతున్నాడు కాబట్టి అతడే ఈ రికార్డు సాధిస్తాడు అని రవి శాస్త్రి నమ్ముతున్నారు.

ఇక 2016 లో విరాట్ కోహ్లీ 80 .01 స్ట్రైక్ రేట్ తో 973 రన్స్ చేయగా అందులో ఏడూ హాఫ్ సెంచరీలు, నాలుగు సెంచరీలు ఉన్నాయ్. ఇక విరాట్ తర్వాత రెండవ స్థానంలో 863 పరుగులతో బట్లర్ ఉండగా, మూడవ స్థానం లో 848 పరుగులతో వార్నర్ నిలిచారు. ఈ రికార్డు దరి దాపుల్లో కూడా మరో ఇండియన్ క్రికెటర్ లేకపోవడం గమనించాల్సిన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: