ఐపీఎల్ లో భారీ సిక్సర్.. కొట్టింది ఎవరో కాదు?
అదే సమయంలో ఐపీఎల్లో అప్పటికే స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు సైతం ఇక తమ ప్రతిభను చాటుకుని ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటి ఒక అరుదైన రికార్డు సాధ్యమైంది. బెంగళూరు జట్టుకు కెప్టెన్ గా ఉన్న డూప్లెసెస్ ఏకంగా ఈ ఏడాది ఐపిఎల్ లో భారీ సిక్సర్ కొట్టాడు అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఎవరూ కూడా అటు డూప్లెసెస్ కి దగ్గరగా సిక్సర్ కొట్టలేకపోయారు. దీంతో ఇక డూప్లెసెస్ కొట్టిన సిక్సర్ కాస్త ఇప్పుడు ఇక ఐపీఎల్ లో అతిపెద్ద సిక్సర్ గా మారిపోయింది.
లక్నో బౌలర్ అయిన రవి బిష్ణయ్ బౌలింగ్లో ఇక ఈ భారీ సిక్సర్ రావడం గమనార్హం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇన్నింగ్స్ సమయంలో 15వ ఓవర్ వేశాడు రవి బిష్ణయ్. అప్పటికే మంచి ఊపు మీద ఉన్న డూప్లెసెస్ బౌలింగ్లో భారీ సిక్సర్ కొట్టగా అది ఏకంగా 115 మీటర్ల దూరం వెళ్ళింది. అంతేకాదు ఏకంగా చిన్న స్వామి స్టేడియం బయటపడింది అని చెప్పాలి. దీంతో ఇక మరో ఎండ్ లో ఉన్న మ్యాక్స్వెల్ ఆ బంతిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ అరాచకం ఏంటి స్వామి అన్నట్లుగా డూప్లెసెస్ మొఖం చూసి తనలో తాను నవ్వుకున్నాడు. ఇక సహచర ఆటగాళ్లందరూ కూడా బంతి స్టేడియం బయటపడటంతో షాక్ అయ్యారు అని చెప్పాలి.