ఐపీఎల్ : పరువు మొత్తం పోయింది.. మొహం కూడా చూపించలేకపోయాడు?

praveen
కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ అటు గుజరాత్ టైటాన్స్ లో కీలక బౌలర్గా కొనసాగుతున్న యష్ దయాల్ కు ఒక పీడకలుగా మిగిలిపోయింది అన్నది మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడు మంచి ప్రదర్శన చేస్తూ అటు వరుస వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర వహించే యష్ దయాల్ కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం పరుగులు ఇవ్వడానికే జట్టులో ఉన్నాడేమో అన్న విధంగా తన ప్రదర్శన కొనసాగించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారీగా పరుగులు సమర్పించుకుంటూ జట్టు ఓటమికి కారణం అయిపోయాడు.


 మరి ముఖ్యంగా అటు చివరి ఆరు బంతుల్లో 29 పరుగులు కావాల్సిన సమయంలో గుజరాత్ విజయం ఖాయం అనుకుంటుండగా.. ఇక రింకు సింగ్ విధ్వంసం సృష్టించాడు అని చెప్పాలి. ఇక అతని బ్యాటింగ్తో బౌలర్కు నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. ఏకంగా ఓకే ఓవర్ లో వరుసగా 5 సిక్సర్లు కొట్టి పరుగులు పిండుకున్నాడు. అతనికి అవకాశం ఉండి ఉంటే ఇక ఆరో బంతి కూడా శిక్ష కొట్టేవాడేమో అని అనిపించింది. ఇక బౌలర్ యష్ దయాళ్ ఓవరాల్ గా  నాలుగు ఓవర్లు వేసి 69 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే యష్ దయాల్ అత్యంత చెత్త రికార్డును కూడా నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్ల జాబితాలో యష్ దయాల్ రెండవ స్థానంలోకి చేరుకున్నాడు. ఈ లిస్టులో తొలి స్థానంలో బాసిల్ తంపి ఉన్నాడు. నాలుగు ఓవర్లలో 70 పరుగులు సమర్పించుకున్నాడు 2018లో ఆర్సిబి తో మ్యాచ్లో. ఇక మూడో స్థానంలో ఇషాంత్ శర్మ 2013లో సీఎస్కే తో మ్యాచ్లో 66 పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా ఉన్నాడు అని చెప్పాలి. ఇంత చెత్త ప్రదర్శన చేసిన ముఖం కూడా చూపించలేకపోయాడు యష్ దయాల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: