
ఆ సినిమా చూస్తే.. ఇప్పటికీ ఏడుపొస్తుంది : డివిలియర్స్
అయితే ఈ ఇంటర్వ్యూలలో ఎంతో మంది ప్లేయర్లు ఇక తమ కెరీర్ కు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు తమ పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను కూడా పంచుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాలను తెలుసుకునేందుకు అభిమానులు కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నారు అని చెప్పాలి. సాధారణంగా సినీ ప్రేక్షకులు కొన్ని సినిమాలను చూసినప్పుడు తెలియకుండానే ఏడ్చేస్తూ ఉంటారు. ఇక ఆ సినిమాను ఎన్నిసార్లు చూసినా అదే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఇక తనకు కూడా ఒక సినిమా విషయంలో ఇలాంటి అనుభవమే ఎదురయింది అంటూ చెబుతున్నాడు ఐపీఎల్ మాజీ ప్లేయర్ ఎబి డివిలియర్స్.
ఇప్పటికీ తాను గ్లాడియేటర్ సినిమా చూస్తే కన్నీళ్లు ఆగవు అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా తనకు బాగా కనెక్ట్ అయిందని.. అందుకే ఎంతగానో ఎమోషనల్ అవుతానని సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ వెల్లడించాడు. ఇటీవల జియో సినిమా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇటీవలే మా పిల్లలతో కలిసి 12వసారి గ్లాడియేటర్ సినిమా చూశాను. అందులోని హింసాత్మక సన్నివేశాలు రాగానే ఇక పక్కనే ఉన్న పిల్లల కళ్ళు మూసే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు డివిలియర్స్. కాగా ఐపీఎల్ లో ఆర్సిబి తరఫున ఎన్నో ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించి ఇక రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే.