ఆర్సిబికి అంత సీన్ లేదు.. టైటిల్ గెలిచేది ఆ జట్టే : డివిలియర్స్

praveen
ప్రస్తుతం 2023 ఐపీఎల్ సీజన్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో కూడా నువ్వా నేనా అన్నట్లుగానే పోరు సాగుతుంది. ఈ క్రమంలోనే ఒకవైపు ఐపీఎల్ మ్యాచ్లు ఉత్కంఠ గా సాగుతుంటే మరోవైపు ఎంతో మంది మాజీ ప్లేయర్లు ఇక తమ రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ రివ్యూలు కూడా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన గురించి మాత్రమే కాదు.. ఇక ఐపీఎల్ టైటిల్ గెలవబోయే జట్టు ఏది అన్న విషయాన్ని కూడా ముందుగానే ఊహిస్తున్నారు మాజీ ప్లేయర్లు.


 ఇక తమ అభిప్రాయం ప్రకారం.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్ లో అడుగు పెట్టబోయే నాలుగు జట్లు ఏవి అన్న విషయాన్ని ముందుగానే చెప్పేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ మాజీ ప్లేయర్స్ ఎబి డివిలియర్స్ 2023 ఐపీఎల్ సీజన్ విజేత ఎవరు అన్న విషయాన్ని ముందుగానే చెప్పేసాడు. అయితే ఐపీఎల్ టైటిల్ విన్నర్ ఎవరు అంటే సాధారణంగా డివిలియర్స్ నోటి నుంచి బెంగళూరు జట్టు పేరు వస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ డివిడియర్స్ బెంగుళూరును పక్కనపెట్టి మరో జట్టు టైటిల్ గెలుస్తుందని ధీమాగా చెప్పాడు.



 ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఐపీఎల్ 16వ సీజన్ టైటిల్ విజేత పై ఆర్సిబి మాజీ ప్లేయర్ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2023 ఐపీఎల్ సీజన్లో టైటిల్ గెలవబోయేది గుజరాత్ టైటాన్స్ అంటూ చెప్పుకొచ్చాడు. గుజరాత్ జట్టు ఎంతో బలంగా కనిపిస్తుంది. ఆ జట్టే విజేతగా నిలుస్తుంది. నేను ఆర్సిబి గెలవాలని కోరుకుంటున్నా. కానీ గుజరాత్ టైటాన్స్ జట్టు మాత్రం అన్ని విభాగాల్లో కూడా ఎంతో పటిష్టంగా బ్యాలెన్స్డ్ గా కనిపిస్తుంది అంటూ ఎబి డివిలియర్స్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీంతో బెంగళూరు జట్టుకు బదులు డివిలియర్స్ గుజరాత్ పేరు చెప్పడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు అని చెప్పాలి. కాగా గత ఏడాది మొదటి ప్రయత్నంలోనే గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: