ఉమ్రాన్.. నాకు ఇచ్చిన మాట తప్పావ్ : ఛాహాల్
ఇక రాజస్థాన్ బుధవారం రోజు పంజాబ్ కింగ్స్ తో మరో మ్యాచ్ ఆడింది. అయితే పంజాబ్ కి రాజస్థాన్ వెళ్తున్నా సమయంలో అక్కడి లోకల్ టీవీ జర్నలిస్ట్ రాజస్థాన్ బౌలర్ ఛాహాల్ ని ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఇది ఆసాంతం చాలా ఫన్నీగా సాగింది. సన్ రైజర్స్ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసిన నువ్వు ఉమ్రాన్ భాయ్ సరిగ్గా డిఫెన్స్ చేయకపోతే నీకు ఐదో వికెట్ కూడా దక్కేది కదా అంటూ జర్నలిస్ట్ ఫన్నీ ప్రశ్న అడుగుతూ ఇప్పుడు అతనికి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగాడు. దానికి ఛాహాల్ సైతం తనదైన రీతిలో ఎంతో ఫన్నీగా సమాధానం చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
ఛాహాల్ చెప్పిన సమాధానం ఇలా ఉంది.. నేను చెప్పడానికి ఏముంది.. మొదట ఉమ్రాన్ ను కలిసినప్పుడు నా బౌలింగ్ లో సిక్సులు కొడతానని మాట ఇచ్చాడు. కానీ అతడు నాకిచ్చిన మాటను తప్పాడు. నాకు ఎంతో బాధగా ఉంది అంటూ చౌహాన్ సెటైరికల్ గా సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.