ఆర్సిబి vs కోల్కతా.. రసవత్తరమైన పోరు తప్పదా?

praveen
ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతూ ఉంది. ఇకపోతే నేడు మరో ఉత్కంఠ భరితమైన పోరుకు సమయం ఆసన్నమవుతోంది అని చెప్పాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఇక బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లో అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘనవిజయాన్ని సాధించింది.



 ఇలా హోమ్ గ్రౌండ్ లో విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇక అటు సొంత అభిమానులు అందరినీ కూడా ఉర్రూతలూగించింది అని చెప్పాలి. అయితే మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మాత్రం మొదటి మ్యాచ్ లోనే ఓడిపోయి అభిమానులు అందరిని కూడా నిరాశ పరిచింది అని చెప్పాలి. అయితే ఇలా తొలి మ్యాచ్లో గెలిచి ఊపు మీద ఉన్న బెంగళూరు రెండో మ్యాచ్లో కూడా గెలవాలని లక్ష్యాన్ని పెట్టుకుంది. అయితే డూప్లిసిస్ తన అనుభవాన్ని అంతా ఉపయోగించి ఇక జట్టును తన కెప్టెన్సీ తో ముందుకు నడిపిస్తున్నాడు.



 అయితే కోల్కతా జట్టుకు అటు అనుభవం ఉన్న కెప్టెన్ అయినా శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో ఇక ఇప్పుడు అతని స్థానంలో నితీష్ రానా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు అని చెప్పాలి. అయితే ఇప్పుడిప్పుడే క్రికెట్ లో ఒక్క అడుగు వేస్తున్నాడు నితీష్ రానా. అటు కెప్టెన్సీలో మాత్రం ఎంతవరకు జట్టును గెలిపించగలడు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది. అయితే మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన కోల్కతా  రెండో మ్యాచ్లో మాత్రం తప్పక గెలిచి ఇక భోని కొట్టాలని చూస్తుంది అని చెప్పాలి. ఇక ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb

సంబంధిత వార్తలు: