కరోనా మహమ్మారీ కారణంగా గత మూడేళ్ల నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు మన హోమ్ గ్రౌండ్స్ లో జరగ లేదు. దీంతో తమ అభిమాన ప్లేయర్స్‌ను లైవ్‌లో చూద్దామని ఆశించిన IPL అభిమానుల ఆశలు నిరాశలయ్యాయి.అయితే ఇప్పుడు ఐపీఎల్ తాజా సీజన్ 2023లో మాత్రం ఆ నిరాశకు ఖచ్చితంగా బ్రేక్ పడనుంది. కరోనా మహమ్మారి లాంటి ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో దేశంలోని వివిధ సిటీలలో IPL మ్యాచ్‌లు జరగనున్నాయి. శుక్రవారం నాటి నుంచి ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభమవుతోన్న నేపథ్యంలో ఇక మన హైదరాబాద్‌లో ఏయే రోజుల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి? ఇంకా పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.2019 వ సంవత్సరం తర్వాత హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనుంది మళ్లీ ఇప్పుడే. ఇక ఈ సీజన్ సన్‌రైజర్స్ హోం గ్రౌండ్లో మొత్తం 7 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఏప్రిల్ నెల 2, 9, 18, 24, మే నెల 4, 13, 18 తేదీల్లో సన్‌రైజర్స్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరగనుండగా.. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తప్ప అన్ని జట్లతోనూ హైదరాబాద్ టీం తన హోం గ్రౌండ్లో మ్యాచ్ లో తలపడనుంది.ఇక హైదరాబాద్ సిటీలో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఏయే జట్లతో ఇంకా ఏ రోజు తలపడనుందంటే.. ఏప్రిల్ 2వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో, ఏప్రిల్ 9వ తేదీన పంజాబి కింగ్స్‌తో, ఏప్రిల్ 18వ తేదీన ముంబై ఇండియన్స్‌తో అలాగే ఏప్రిల్ 24వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 4వ తేదీన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో, మే 13వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇంకా అలాగే మే 18వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ టీం హోమ్ గ్రౌండ్లో తలపడనుంది. ఇంకెందుకు ఆలస్యం క్రికెట్ అభిమానులు ఆలస్యం ఆ షెడ్యూల్‌కు అనుగుణంగా టికెట్స్‌ను బుక్ చేసుకొని అసలైన క్రికెట్ మజాను పొందండి.