ఆ సమయంలో.. నా దగ్గర ఉన్న కార్లను అమ్మేశా : కోహ్లీ

praveen
టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి ప్రపంచ క్రికెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదండోయ్ అటు స్టార్ క్రికెటర్లు సైతం విరాట్ కోహ్లీకి అభిమానులుగా మారిపోతూ ఉంటారు. అతని ఆట తీరుకు అతని యాటిట్యూడ్ కి కూడా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు అని చెప్పాలి.  ఇక ఈ రేంజ్ లో క్రేజ్ ఉంది కాబట్టి అటు ఫాలోవర్ల విషయంలో సోషల్ మీడియాలో మిగతా క్రికెటర్లకు  అందనంత దూరంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ.

 ఇక ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ అత్యుత్తమమైన ప్రదర్శన చేస్తూ ఇక ప్రపంచ రికార్డులు కొల్లగొట్టడంలో విరాట్ కోహ్లీ ఎప్పుడు ముందుంటాడు అని చెప్పాలి. ఇక సంపాదన విషయంలో కూడా విరాట్ కోహ్లీ దరిదాపుల్లో మరో స్టార్ క్రికెటర్ లేడు అనడంలోనూ అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒకవైపు  క్రికెట్ ద్వారానే కాకుండా.. మరోవైపు వాణిజ్య ప్రకటన ద్వారా కూడా కోట్ల రూపాయలు సంపాదిస్తుంటాడు. అంతేకాదు ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా కూడా కోట్ల ఆదాయం ని వెనకేసుకుంటూ ఉంటాడు అని చెప్పాలి.

 సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే విరాట్ కోహ్లీ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా అప్పుడప్పుడు పంచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇటీవలే  తాను చాలా కార్లను అమ్మేసాను అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాను వాడిన చాలా కాళ్లు ముందుచూపు లేకుండా కొన్నవే అంటూ తెలిపాడు. వాటిని పెద్దగా నడిపింది లేదని చెప్పుకొచ్చాడు. ఆర్సిబి ఆటగాళ్ల ఫోటోషూట్ సందర్భంగా కోహ్లీ బోల్డ్ డైరీస్ లో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించాడు. పరిణితి వచ్చిన తర్వాత అనవసరంగా కొన్నాను అనిపించి ఎన్నో కార్లను అమ్మేసాను అంటూ తెలిపాడు విరాట్ కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: