సన్రైజర్స్ జట్టుకి.. మరోసారి కెప్టెన్సీ మార్పు?

praveen
గత రెండు సీజన్ల నుంచి కూడా లీగ్ దశ నుంచే ఇక ఐపీఎల్ నుంచి నిష్క్రమిస్తూ వచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలని లక్ష్యంతో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇకజట్టుకు మైనస్ గా మారుతున్న ఆటగాళ్లను వదులుకొని కొత్త ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేసింది. అయితే ఇక ఏడాది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎవరి కెప్టెన్సీలో బలిలోకి దిగిపోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఎందుకంటే గత సీజన్ వరకు కెప్టెన్ గా ఉన్న కేన్ విలియమ్సన్ ను వేలంలోకి వదిలేసింది సన్రైజర్స్ జట్టు యాజమాన్యం.

 ఇక కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకోగా.. సన్రైజర్స్ కెప్టెన్ గా ఎవరు బాధ్యతలు చేపడతారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో సన్రైజర్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్ గా టైటిల్ అందించిన ఐడెం మార్గరమ్ వైపే అటు జట్టు యాజమాన్యం మొగ్గుచూపింది. హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను  కూడా అతనికి అప్పగించింది. దీంతో అతని కెప్టెన్సీలో టీం బాగా రాణించడం ఖాయం అనుకుంటున్న సమయంలో ఇక ఇప్పుడు సన్రైజర్స్ జట్టుకు మరోసారి కెప్టెన్సీ మార్పు జరిగింది. టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారధ్య బాధ్యతలు నిర్వహించబోతున్నాడు అన్నది తెలుస్తుంది.

 అయితే గతంలోనే సన్రైజర్స్ కెప్టెన్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ఐడన్ మార్కరమ్ అనే అధికారికంగా ప్రకటించినప్పటికీ ప్రస్తుతం సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య సిరీస్ నేపథ్యంలో మార్కరమ్ ఐపిఎల్ ఆరంభ మ్యాచ్ లకు దూరం కాబోతున్నాడట. దీంతో అతని ప్లేస్ లో భువనేశ్వర్ కుమార్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. కెప్టెన్లు ఐపీఎల్ కప్పుతో ఫోటోలకు ఫోజులు ఇవ్వగా సన్రైజర్స్ కెప్టెన్గా భువనేశ్వర్ కుమార్ పాల్గొన్నారు. అయితే భువనేశ్వర్ కి కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు అని చెప్పాలి. దీంతో జట్టును ఎలా నడిపిస్తాడో అని ఆందోళన చెందుతున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: