చెన్నై జట్టులోకి కొత్త ప్లేయర్.. ఎవరో తెలుసా?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ నేటి నుంచే ప్రారంభం కాబోతుంది. మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ మొదలు కాబోతుంది అన్న విషయం తెలిసిందే. కాగా నేడు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా ఇక ఈ మ్యాచ్ జరుగుతుంది అని చెప్పాలి.

 అయితే మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగుతుండగా ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్  మ్యాచ్ ఆడబోతుంది. అయితే హార్దిక్ పాండ్యా తనకు ధోని గురువు అని చెబుతూ ఉంటాడు. కాగా నేటి మ్యాచ్లో ఏకంగా గురుశిష్యుల మధ్య పోటీ జరగబోతుంది అని చెప్పాలి. ఇక ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక చెన్నై జట్టులో ఉన్న పలువురు ఆటగాళ్లు గాయాల బారిన పడిన నేపథ్యంలో ఇక ఒక కొత్త ప్లేయర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరిపోయాడు అన్నది తెలుస్తుంది.

 గత సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేసి తన బౌలింగ్ తో ఆకట్టుకున్న ముఖేష్ చౌదరి.. ఇక ఈ ఏడాది కూడా బాగా రాణిస్తాడని అందరూ భావించారూ. కానీ ఊహించని రీతిలో అతను గాయం బారిన పడి ఇక ఐపీఎల్ టోర్నీ మొత్తానికి కూడా దూరం అయ్యాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని స్థానంలో మరో యువ ఫేసర్ ఆకాశ సింగ్ ను తీసుకున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. నాగాలాండ్ కు చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ గతంలో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అతను ఎలా రాణించబోతున్నాడు  అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: