రహానే, భువనేశ్వర్ కెరియర్ ముగిసినట్లేనా.. షాకిచ్చిన బీసీసీఐ?

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్లో యువ ఆటగాళ్ల హవా ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త ప్రతిభ తెర మీదికి వస్తూనే ఉంది. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతూ ఇక అద్భుతమైన ఆటతీరుతో ఇక ప్రస్థానాన్ని కొనసాగించిన సీనియర్ల కెరియర్ మాత్రం యువ ఆటగాల రాకతో ప్రమాదంలో పడిపోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ఎంతోమంది సీనియర్లు  ఇప్పటికే భారత జట్టులో కనిపించకుండా పోయారు అని చెప్పాలి.

 అలాంటి వారిలో ఒకప్పుడు జట్టులో కీలక ప్లేయర్లుగా కొనసాగిన అజంక్య రహనే, భువనేశ్వర్ కుమార్ లు కూడా ఉండడం గమనార్హం. గత కొంతకాలం నుంచి వరుసగా గాయాలు పారిన పడిన నేపథ్యంలో భువనేశ్వర్ కుమార్ ని అటు సెలెక్టరు కూడా పక్కన పెట్టారు. అయితే అతను కేవలం ఐపిఎల్ లో మినహా భారత జట్టులో కనిపించడం లేదు అని చెప్పాలి. ఇక అజింక్య రహనే ఒకప్పుడు ఏకంగా విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు జట్టు వైస్ కెప్టెన్ గా కూడా కొనసాగాడు. ఇక కోహ్లీ గైర్హాజరు సమయంలో తన కెప్టెన్సీ ప్రతిభ ఏంటో చూపించి టీమిండియా కు చారిత్రాత్మక విజయాలు అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

 కానీ ఇప్పుడు అజించే రహానే కెరియర్ కూడా పూర్తిగా ప్రమాదంలో పడిపోయింది అని చెప్పాలి. కాగా ఫామ్ కోల్పోయి టీమ్ ఇండియాకు దూరమైన రహానే, భువనేశ్వర్ కుమార్ లు ఈసారి బీసీసీఐ వార్షిక వేతన కాంట్రాక్ట్ లో చోటు దక్కలేదు. దీంతో వీరు భారత్ ఆడే భవిష్యత్తు టూర్లలో ఆడకపోవచ్చు అన్నది తెలుస్తుంది. మొత్తం 26 మంది ఆటగాళ్లకు మాత్రమే 2022 -23 సీజన్ కాంట్రాక్టులో చోటు లభించింది. గత సీజన్లో ఉన్న ఏడు ప్లేయర్లను ఈసారి కాంట్రాక్ట్ నుంచి తొలగించింది బీసీసీఐ. దీపక్ చాహర్, హనుమ విహారి, ఇశాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహ,  మయాంక్ అగర్వాల్ లను అటు బిసిసిఐ పట్టించుకోలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: