కోహ్లీ గురించి.. 9వ తరగతి క్వశ్చన్ పేపర్లో ప్రశ్న?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న అద్భుత ప్లేయర్లు అందరిలో కూడా అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంటాడు విరాట్ కోహ్లీ అని చెప్పాలి. అయితే తన ఆట తీరూతో తాను అందరిలా వచ్చిపోయే ఆటగాడిని కాదు చరిత్రలో నిలిచిపోయే ప్లేయర్ని అన్న విషయాన్ని నిరూపించాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు వరకు ఎన్నో అద్భుతమైన ప్రపంచ రికార్డులు సృష్టించి అదరగొట్టాడు అని చెప్పాలి.


 క్రికెట్ ను ఫ్యాషన్ గా మార్చుకోవాలి అనుకునే ఎంతోమందికి విరాట్ కోహ్లీ స్ఫూర్తిగా నిలిచాడు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు అని చెప్పాలి. అయితే ఇలా క్రికెట్లో అద్భుతం ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గురించి ఇటీవల ఏకంగా పరీక్ష పేపర్లో ఒక ప్రశ్న రావడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా 9వ తరగతి క్వశ్చన్ పేపర్ లో విరాట్ కోహ్లీ గురించి ఒక ప్రశ్న వచ్చింది. ఇక ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 9వ తరగతి ఇంగ్లీష్ పేపర్లో కోహ్లీ ఫామ్ లోకి వచ్చి రీ ఎంట్రీ ఇచ్చిన విధానంపై 100 నుంచి 120 పదాల్లో సమాధానం రాయాలి అంటూ ఒక ప్రశ్న వచ్చింది. అయితే ఈ ప్రశ్న చూసి అటు విద్యార్థులు కూడా షాక్ అయ్యారు అని చెప్పాలి. ఇక ఈ ప్రశ్నకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో ఎంతో గానో వైరల్ గా మారిపోయాయి. అయితే ఈ విషయం తెలిసి అటు అభిమానులు అందరూ మాత్రం ఎంతగానో మురిసిపోతున్నారు అని చెప్పాలి. తమ అభిమాన ఆటగాడు అయినా విరాట్ కోహ్లీ గురించి రాయడానికి 120 పదాలు కాదు అసలు పేజీలే సరిపోవు అంటూ ఎంతో మంది అభిమానులు కామెంట్లు పెడుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: