చరిత్ర సృష్టించిన రోనాల్డో.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్?

praveen
క్రిస్టియానో రోనాల్డో.. ఈ పేరు వినిపించింది అంటే చాలు అభిమానులు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటారు. అంతలా ఇక ఈ ప్లేయర్ ఫుట్బాల్ ఆటలో స్టార్ గా కొనసాగుతూ వున్నాడు అన్న విషయం తెలిసిందే. పోర్చుగల్ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహిస్తూ సారధిగా, ఆటగాడిగా  ఎన్నో అరుదైన విజయాలను అందించాడు క్రిస్టియన్ రోనాల్డో. అయితే కేవలం ఒక్క వరల్డ్ కప్ గెలవలేదు అన్న వెలితి తప్ప అతని కెరియర్ లో ఇప్పటివరకు అన్ని రికార్డులు సాధించాడు అని చెప్పాలి.

 ఇక ఎప్పుడూ ఎంతో అద్భుతమైన ఆట తీరుతో ప్రత్యర్ధులను వనికిస్తూ ఉంటాడు క్రిస్టియానో రోనాల్డో. అటు మైదానంలో చిరుత పులిలా పరిగెత్తుతూ.. అద్భుతమైన గోల్స్ సాధిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే గత ఏడాది ఫిఫా వరల్డ్ కప్ అతని కెరియర్ లో చివరిది అని అందరు భావించారు. ఈ క్రమంలోనే జట్టుకు వరల్డ్ కప్ అందిస్తాడు అని ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఫిఫా వరల్డ్ కప్ లో జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు క్రిస్టియనో రోనాల్డో. అయితే ప్రస్తుతం జర్మనీ వేదికగా జరుగుతున్న యూరోప్ 2024 క్వాలిఫైయర్ లో మాత్రం దుమ్మురేపాడు అని చెప్పాలి.

 గ్రూపు జేలో భాగంగా గురువారం లిచేన్ స్టైయిన్, పోర్చుగల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో క్రిస్టియానో రోనాల్డో కు 197వ మ్యాచ్ కావడం గమనార్హం . ఈ కార్యక్రమంలోనే ఒక దేశం తరఫున అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా రోనాల్డో చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ కు ముందు 196 మ్యాచ్లతో కువైట్ కు చెందిన బాదర్ అల్ ముతాబాతో సమంగా ఉన్నాడు. అయితే ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా మోరాకో తో జరిగిన క్వాటర్ ఫైనల్స్ రోనాల్డ్ లోకి 196 వ మ్యాచ్..  ఇక 197వ మ్యాచ్లో రోనాల్డో రెండు గోల్స్ తో అదరగొట్టాడు. ఇలా 197 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రోనాల్డో 120 గోల్స్ కొట్టి ఆల్ టైం లీడింగ్ గోల్ స్కోరర్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడూ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: